Bigg Boss 7 Telugu: నీ రంగులన్నీ నాకు తెలుసు… నామినేషన్స్ లో ప్రియాంక వర్సెస్ శివాజీ!

నువ్వు ప్రియాంక పై అంత స్టాండ్ తీసుకున్నపుడు .. మా ఇద్దరి గేమ్ ఎలా చూసావ్.. మరి ప్రియాంక ది ఎలా చూసావ్ అని శివాజీ అంటే .. అది నాకు సంబంధం లేదు అని గౌతమ్ అన్నాడు.

Written By: NARESH, Updated On : November 21, 2023 4:01 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ 12 వ నామినేషన్స్ హోరా హోరీగా సాగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో మొదలైన నామినేషన్ ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. కాగా కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. తాజా ప్రోమోలో శివాజీ , ప్రియాంక మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా శివాజీ గౌతమ్ ని నామినేట్ చేస్తూ ‘ ప్రతి పాయింట్ కరెక్ట్ గా మాట్లాడుతున్నావ్ కదా.. మరి యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయాల అని నాగార్జున అడిగినప్పుడు నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తలేదు అని కరెక్ట్ పాయింట్ రైజ్ చేశాడు.

నువ్వు ప్రియాంక పై అంత స్టాండ్ తీసుకున్నపుడు .. మా ఇద్దరి గేమ్ ఎలా చూసావ్.. మరి ప్రియాంక ది ఎలా చూసావ్ అని శివాజీ అంటే .. అది నాకు సంబంధం లేదు అని గౌతమ్ అన్నాడు. మరి ఫౌల్స్ గురించి అడగడానికి నీకేం సంబంధం అంటూ శివాజీ నిలదీసాడు. ఇక యావర్ .. అమర్ ని నామినేట్ చేశాడు. తర్వాత శోభా , అర్జున్ ని నామినేట్ చేసింది. ‘ ఎవరో నీ వెనుక ఉండటం వల్లే గెలుస్తున్నావ్ అనే మాట నాకు నచ్చలేదు అని శోభా చెప్పింది.

తర్వాత ప్రియాంక శివాజీని నామినేట్ చేసింది. ఆ రోజు నన్ను ఎందుకు నామినేట్ చేశారు అంటూ ప్రియాంక మొదలుపెట్టింది. ‘ నువ్వు ఎంత వాధించిన .. ఆ రోజు నువ్వే గట్టిగా మాట్లాడావ్ అని శివాజీ అన్నాడు. దీంతో తెలుస్తుందిలే ఈ హౌస్ లో ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారో అని అనడంతో.. సరే నువ్వే గొప్ప .. నీ నామినేషన్ యాక్సప్ట్ చేస్తున్న అని వెళ్లి కూర్చోబోయాడు శివాజీ.

ప్రియాంక మాత్రం ‘ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి’ అంటూ సాగదీసింది. దీంతో నువ్వు ఎవరు నన్ను చెప్పమనడానికి .. నీ నామినేషన్ ని యాక్సప్ట్ చేస్తున్నాగా .. నీతో ఇంకా డిఫెండ్ చేసుకో దలుచుకోలేదు అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ప్రియాంక అనడంతో .. ఎందుకంటే నీ రకరకాల కలర్స్ అన్ని చూస్తున్న కాబట్టి .. నువ్వు పొరపాట్లు చేస్తున్నావ్ .. నీకు తెలుసు.. నేను చెప్పలేను అంటూ సీరియస్ అయ్యాడు. ఇక చివర్లో అర్జున్ ‘ హౌస్ లో నీతో కలవడం అనేది జరగదు’ అంటూ యావర్ తో చెప్పాడు.