Lokesh Kanagaraj: ‘ఖైదీ’ సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్’ సినిమా పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా తను పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు… అప్పట్లో ఆయన డైరెక్షన్లో నటించడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపించారు. అలాంటి దర్శకుడు రీసెంట్ గా రజనీకాంత్ తో చేసిన ‘కూలీ’ సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. దాంతో లోకేష్ కనకరాజుకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంతకు ముందు అతను కమిట్ అయిన సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కొత్త కథతో ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకున్నప్పటికి ప్రస్తుతం ఆ స్టార్ హీరో కూడా లోకేష్ కనకరాజు చెప్పే కథను వినడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో లోకేష్ కనకరాజు మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…ఆ స్టార్ హీరో ఎవరు అనేదాని మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే లోకేష్ ను రిజెక్ట్ చేసిన హీరో కమల్ హాసన్ గా తెలుస్తోంది…ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఆ తర్వాత ఒక్కసారిగా కూలీ తో డీలా పడిపోవడంతో అతన్ని పట్టించుకునే వారు కరువైపోయారు. అందుకే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టతరమైన పని…
అందుకే ఇప్పుడు లోకేష్ మరోసారి ఒక మంచి సబ్జెక్టుతో సక్సెస్ సాధించి స్టార్ హీరోలను తన వెంట తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే కూలీ సినిమా మీద రజినీకాంత్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాటిని లోకేష్ కనకరాజు అందుకోకపోవడంతో ఆయన మీద తీవ్రమైన విమర్శలైతే వచ్చాయి.
ఇప్పుడు ఆ విమర్శలకు ప్రతిరూపంగానే అతనికి డేట్స్ కూడా ఎవరు ఇవ్వడం లేదంటే ఆయన ఎంతటి దుబ్బరమైన పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లు మాత్రమే టాప్ పొజిషన్ కి వెళ్తారు. లేకపోతే పాతాళానికి పడిపోతారని చెప్పడానికి లోకేష్ కనకరాజును మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు… మొత్తానికైతే లోకేష కనకరాజ్ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే వచ్చింది…