Nitya Menon : షూటింగ్ లొకేషన్ లో నిత్యమీనన్ ని పొట్టిదానా అని పిలుస్తూ అవమానించిన స్టార్ హీరో..తర్వాత ఏమైందంటే!

అప్పుడు కోపం తో రగిలిపోయిన నిత్యా మీనన్ బక్కెట్ నిండా నీళ్లు తీసుకొని నాని పై కుమ్మరించాడట. దాంతో సెట్ లో కాసేపు వీళ్లిద్దరి కారణం గా సరదా వాతావరణం నెలకొందని అంటున్నారు.

Written By: Vicky, Updated On : June 9, 2023 6:10 pm
Follow us on

Nitya Menon : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందం, అభినయం మరియు తెలివితేటలూ ఇలా అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని సిద్ధాంతాలను తూచా తప్పకుండ ఫాలో అయ్యే హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు సరిగ్గా ద్రుష్టి సారిస్తే ఇండస్ట్రీ లో ఏ ఒక్క హీరోయిన్ కూడా పనికిరారు అనే రేంజ్ ఉంది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు నిత్యా మీనన్.

బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత 7 ‘O’ క్లాక్  అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలా పలు మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ అనే సినిమాతో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో నిత్యామీనన్ కి టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురిసింది.

అవకాశాలు వస్తున్నాయి కదా అని చేతికి దొరికిన ప్రతీ సినిమా చెయ్యకుండా, చాలా సెలెక్టివ్ గా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ ముందుకు సాగింది. రీసెంట్ గా ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ అనే సూపర్ హిట్ చిత్రం లో నటించింది, ఈ సినిమా తర్వాత ఆమె ఇప్పటి వరకు తెలుగులో మరో చిత్రాన్ని ప్రకటించలేదు కానీ, ఇతర భాషల్లో మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తుంది.

అయితే ఈమెకి ఇండస్ట్రీ లో న్యాచురల్ స్టార్ నాని మంచి క్లోజ్ ఫ్రెండ్ అట,బయట కలిసినప్పుడు నిత్యామీనన్ ని పొట్టిదాన అని పిలిచేవాడట. ఒకరోజు షూటింగ్ లొకేషన్ లో అందరూ చూస్తుండగా పొట్టిదాన అని పిలిచే లోపు అందరూ నవ్వుకున్నారట. అప్పుడు కోపం తో రగిలిపోయిన నిత్యా మీనన్ బక్కెట్ నిండా నీళ్లు తీసుకొని నాని పై కుమ్మరించాడట. దాంతో సెట్ లో కాసేపు వీళ్లిద్దరి కారణం గా సరదా వాతావరణం నెలకొందని అంటున్నారు.