Ram Charan: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన వాళ్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా సబ్జెక్టులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా భారీ రికార్డులను కూడా కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తో ఆయన ఎప్పుడు సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో రామ్ చరణ్ టాప్ 3 లో ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేసి ఎన్టీఆర్ తో ఇక భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేయబోతున్నాడనే దానిమీద క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఆయన చేసిన కేజిఎఫ్ సినిమానే రామ్ చరణ్ తో చేయాల్సిందే.
కానీ అప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి రామ్ చరణ్ కి కథ చెప్పే అంత రేంజ్ లేకపోవడంతో యష్ ని హీరోగా పెట్టి ఆ సినిమాని తెరకెక్కించాడు. మరి మొత్తానికేత సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సలార్ లాంటి సినిమా చేసి మరోసారి మరో మెట్టు పైకి ఎదిగాడు. అది రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా అయినప్పటికి మిస్ అవ్వడం వల్ల కేజీఎఫ్ యష్ తో చేశాడు.
నిజానికి రామ్ చరణ్ యశ్ ఇద్దరు ఒకే లుక్ లో ఉంటారు. మరి ఇప్పుడు ఆయన రామ్ చరణ్ తో సినిమా చేయడానికి అతను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడట. మరి అది ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందనేది క్లారిటీగా తెలియడం లేదు…కానీ మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనేది పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. కానీ అది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది క్లారిటీగా తెలియడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళకాంబో వచ్చే సినిమా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…