Actor who irritated Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి…బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…వరుసగా 12 విజయాలతో హిస్టరీ క్రియేట్ చేసి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారి ఇండస్ట్రీని ఏలుతున్నాడు. పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులను పెట్టి భారీ మల్టీస్టారర్ సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో పలు రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు…ఇక అక్టోబర్ 31వ తేదీన ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రెండు పార్టులను కలిపి రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్ లను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు నటుడు నాజర్ కొన్ని సన్నివేశాల్లో రాజమౌళిని ఇరిటేట్ చేశారట. కారణం ఏంటి అంటే రాజమౌళి చెప్పినట్టుగా కాకుండా నాజర్ తన స్టైల్ ని వాడుతూ కొంత ఇంప్రూవైజ్ చేసి నటించారట.
కానీ రాజమౌళికి మాత్రం అది నచ్చలేదు. దాంతో నాజర్ కి రెండు మూడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికి ఆయన అంత పర్ఫెక్ట్ గా చేయకపోవడంతో తన చేతిలో ఉన్న మైక్ ని పక్కకు విసిరేసి రాజమౌళి షూట్ బ్రేక్ ఇచ్చాడట. ఇక బ్రేక్ తర్వాత నాజర్ ని కలిసి తన సీన్స్ లో ఉన్న డెప్త్ ను ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చేయించుకున్నాడట.
ఇక అప్పుడు నాజర్ రాజమౌళికి ఏం కావాలో తెలుసుకొని దాన్ని చేస్తూ సినిమా అవుట్ పుట్ బాగా రావడానికి సహకరించారట. మొత్తానికైతే ఈ సినిమాలో నాజర్ చేసిన బిజ్జలదేవ క్యారెక్టర్ కి చాలా మంచి ఆదరణ దక్కింది. తన కొడుకు రాజు కావాలనే ఒక స్వార్థపూరితమైన కోరికతో చెడు పనులు చేసే నటుడిగా తను గొప్ప పర్ఫామెన్స్ ఇచ్చాడు…ఇక ఇప్పుడు మరోసారి బాహుబలి రీ రిలీజ్ లో రాజమౌళి ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…