Baahubali The Epic interview promo: అక్టోబర్ 31న ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి : ది ఎపిక్’ విడుదల కాబోతోంది. బాహుబలి 1,2 సినిమాలను కలిపి ‘బాహుబలి : ది ఎపిక్’ గా ఎడిట్ చేసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మొదట్లో విడుదలైనప్పుడు లేని కొన్ని సన్నివేశాలను కూడా ఈ రీ రిలీజ్ ప్రింట్ లో జోడించారు. ఓవరాల్ సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాల వరకు ఉంటుందట. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఒక్క ఓవర్సీస్ లో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి. చూస్తుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ఆల్ టైం రికార్డు నమోదు అవ్వడం దాదాపుగా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇవన్నీ పక్కన పెడితే కొద్దిరోజుల క్రితం ప్రభాస్,రానా మరియు రాజమౌళి కలిసి ఈ రీ రిలీజ్ కోసం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో లో ప్రభాస్, రానా, రాజమౌళి స్నేహితులు లాగా కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం చాలా ఫన్నీ గా అనిపించింది. ఈ ప్రోమో లో ముందుగా ప్రభాస్ రాజమౌళి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘బాహుబలి అనుభూతి గురించి మీ మాటల్లో చెప్పండి’ అని అడగ్గా, దానికి రాజమౌళి సమాధానం చెప్తూ ‘ఎప్పుడైతే కట్టప్ప బాహుబలి ని చంపడానికంటే ముందు, చంపడానికి సిద్ధం అవుతున్న సమయం లో అతను పడే మనోవేదన నన్ను ఎంతో కదిలించింది. పదేళ్ల నుండి నేను ఆ సన్నివేశం దగ్గరే ఆగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా బాహుబలి మొదటి భాగం ఇంటర్వెల్ సమయం లో రానా విగ్రహాన్ని ప్రతిష్టించే సన్నివేశం గురించి మాట్లాడుతూ, ఆ విగ్రహాన్ని పైకి లేపేటప్పుడు క్రేన్స్ కూడా షేక్ అయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.
అదే విధంగా ప్రభాస్ ఏమి నటించాడు రా అని అనిపించినా సన్నివేశం మీకు ఏమిటి అని రాజమౌళి ని రానా అడగ్గా, ‘చనిపోయే ముందు అమ్మ జాగ్రత్త అని చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంటుంది’ అని అంటాడు రాజమౌళి. రానా తన అనుభూతి గురించి చెప్తూ ‘ఎప్పుడైతే నేను ఆ కిరీటం పై ప్రమాణం చేసానో, అప్పటి నుండే ఆ రాజ్యం నాది అని ఫిక్స్ అయిపోయాను’ అంటాడు రానా. త్వరలోనే పూర్తి ఇంటర్వ్యూ ని విడుదల చేయబోతున్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈ రీ రిలీజ్ పై ఇంకా హైప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రీ రిలీజ్ లో బాహుబలి ఎలాంటి అద్భుతాలు నెలకొల్పబోతోంది అనేది.
#SSRajamouli, #Prabhas and #RanaDaggubati come together to talk about #BaahubaliTheEpic and much beyond!#BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/HrjADmpC1B
— Tupaki (@tupaki_official) October 27, 2025