Sticker on Rakul Preet neck: పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ఒకానొక దశలో ఈమె టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా కూడా కొనసాగింది. కేవలం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో తప్ప అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్, తర్వాత కెరీర్ ని సరైన దారిలో నడిపించడంలో విఫలం అయ్యిందో. ఫిట్నెస్ పై విపరీతమైన మక్కువ చూపించి, సన్నగా తీగలాగా మారిపోయి, తన లుక్స్ ని చెడగొట్టుకుంది. అప్పటి నుండి ఈమెకు మెల్లగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. చేసిన సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం, హిందీ లో కూడా ఈమె సినిమాలు ఈమధ్య కాలం లో డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.
ఈమె చివరిసారిగా వెండితెర పై కనిపించిన తెలుగు చిత్రం ‘కొండపొలం’. ఆ సినిమా తర్వాత ఈమె టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. హీరోయిన్ అవకాశాలు ఇచ్చే వాళ్ళే కరువు అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ని నెట్టుకొస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రకుల్ ప్రీత్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో ఆమె మెడ వెనుక భాగం లో ఒక స్టిక్కర్ తగిలించి ఉంది. ఈ స్టికర్ ని ఆమె ఎందుకు వేసుకుంది?, దీని ప్రత్యేకత ఏమిటి అని చాలా మంది రీసెర్చ్ చేశారు. అలా రీసెర్చ్ గా చేయగా తెలిసింది ఏమిటంటే ఈ స్టిక్కర్ పేరు లైఫ్ వేవ్ ఎక్స్ – 39 ప్యాచ్. ఈ ప్యాచ్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ స్టిక్కర్ మన శరీరం లోని మూలకణాల్ని ప్రేరేపితం చేస్తుందట.
శరీరం లోకి కొత్త ఎనర్జీ ని పెంచుతుందట. అంతే కాదు చర్మాన్ని చాలా కాంతివంతంగా చేయడంతో పాటు, కండరాల్ని మరింత ఉత్తేజంగా మార్చుతుంది. అంతే కాదు యాంటీ ఏజింగ్ గా కూడా ఇది పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ అంటే మన వయస్సు ని ముఖం పై కనిపించకుండా చేయడం. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే, రకుల్ ఈ స్టిక్కర్ ని ధరించినట్టు తెలుస్తుంది. ఈ స్టిక్కర్ ని రోజుకి 12 గంటల పాటు పెట్టుకోవచ్చు అట. అయితే ఈ స్టిక్కర్ ఉపయోగాలు సైంటిఫిక్ గా ఇంకా ఖరారు కాలేదు. ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అయినప్పటికీ ఎంతో అప్డేట్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, దీనిని విదేశాల నుండి ప్రత్యేకంగా తెప్పించుకుందట. మరి ఈ స్టిక్కర్ వల్ల నిజంగానే అన్ని ప్రయోజనాలు ఉంటాయా లేదా అనేది ఆమె మాత్రమే చెప్పగలదు.