https://oktelugu.com/

Senior Actress Tulasi: ప్రభాస్.. కృష్ణంరాజుకి మధ్య ఉన్న తేడా అదే అంటున్న సీనియర్ నటి..

ప్రభాస్ అంటే ఇష్టపడని వారు దాదాపు ఎవరు ఉండరు. అందుకే ఆయన్ని అందరూ డార్లింగ్ అని కూడా అంటుంటారు. ఇక అలాంటి ప్రభాస్ గురించి అలానే కృష్ణంరాజు గురించి ఈ మధ్య సీనియర్ నటి తులసి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 13, 2023 / 06:34 PM IST

    Senior Actress Tulasi

    Follow us on

    Senior Actress Tulasi: కృష్ణంరాజు నట వారసుడిగా మన రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో తనదైన ముద్రవేశారు. తన యాక్టింగ్ తో తానే సొంతంగా ఎదిగి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ కి చేరాడు ప్రభాస్.

    ప్రభాస్ అంటే ఇష్టపడని వారు దాదాపు ఎవరు ఉండరు. అందుకే ఆయన్ని అందరూ డార్లింగ్ అని కూడా అంటుంటారు. ఇక అలాంటి ప్రభాస్ గురించి అలానే కృష్ణంరాజు గురించి ఈ మధ్య సీనియర్ నటి తులసి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

    ఒకప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన తులసి ఈతరం స్టార్ హీరోలు అందరికీ అమ్మ పాత్ర చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. తన సినీ కెరీర్ లో సుమారు 700 పైగా సినిమాల్లో నటించారు తులసి. దాదాపు 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తులసి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ తరం స్టార్ హీరోల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

    ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ల గురించి తులసి చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీలో రెండు తరాల హీరోలతో కంటిన్యూస్ గా సినిమాలు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు తులసి. కృష్ణగారి సినిమాల్లో నటించి ఇప్పుడు వారి కొడుకు మహేష్ సినిమాలో నటించడం, అలాగే కృష్ణంరాజు గారితో చేసి ఇప్పుడు ప్రభాస్ సినిమాలో చేయడం.. అలా అప్పటి పెద్ద హీరోలతో చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లల సినిమాల్లో చేయడం ఒక మహాభాగ్యం అని అన్నారు.

    ‘నిజానికి ఇప్పటి హీరోలకు నేను అంతగా తెలియదు. కానీ ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు నన్ను ఎంతో రెస్పెక్ట్ తో చూడడం నాకు నచ్చింది. వాళ్లలో నాకు పెద్దగా ఏం డిఫరెన్స్ కనిపించదు. కృష్ణంరాజు గారు ఎలా మాట్లాడుతారో ప్రభాస్ కూడా అలాగే మాట్లాడతారు. ఇద్దరూ కూడా నటులకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే మనుషులు. కాకపోతే ప్రభాస్ అందరిని డార్లింగ్ అంటాడు. తన తోటి వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సో నా దృష్టిలో రాజు అంటే ప్రభాస్ మాత్రమే. కృష్ణంరాజు తర్వాత నేను చూసిన కింగ్ ప్రభాస్’ అని ప్రభాస్ ని తెగ పొగిడేసింది తులసి.