Shahrukh Khan Assets: ఇండియాలోనే అత్యంత రిచ్చెస్ట్ హీరో.. షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

ప్రస్తుతం నెంబర్ వన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ 100 కోట్లకి పైనే ఉంటుంది మరి కొన్ని సినిమాలకి అయితే ఆయన ప్రాఫిట్ లో పర్సెంటెజ్ కూడా తీసుకుంటాడు.

Written By: Gopi, Updated On : November 2, 2023 2:45 pm

Shahrukh Khan Assets

Follow us on

Shahrukh Khan Assets: ఇండియాలో నెంబర్ వన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఈరోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఆయన కి సంభందించిన చాలా విషయాలు ఇప్పుడు నెట్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి…ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఇండియన్ లో ఉన్న చాలా మంది హీరోల్లో రిచేస్ట్ హీరో గా పేరు సంపాదించుకున్నాడు… ఇంతకు ఆయన కెరియర్ ఎలా మొదలైంది ఆయన ఆస్తుల విలువ ఎంత అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… షారుఖ్ ఖాన్ మొదట ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు చాలా కష్టాలను అనుభవించాడు. ముందుగా బుల్లితెర మీద ఫౌజి అనే సీరియల్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత 1992వ సంవత్సరంలో దివానా అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఖాన్ అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కింగ్ ఖాన్ ఎదిగాడు. బాజీగర్‌, దుర్‌, డిడిఎల్‌జె, కుచ్‌ కుచ్‌ హోతా హై, డాన్‌, డాన్‌ 2, ఫానా,రంగ్ దే బనాది జోడీ, చెన్నై ఎక్స్‌ప్రెస్‌ లాంటి సినిమాలు ఆయనకి నటుడు గా మంచి పేరు ని తీసుకువచ్చాయి…

ఇక ప్రస్తుతం నెంబర్ వన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ 100 కోట్లకి పైనే ఉంటుంది మరి కొన్ని సినిమాలకి అయితే ఆయన ప్రాఫిట్ లో పర్సెంటెజ్ కూడా తీసుకుంటాడు. ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ ఆస్తుల మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన దగ్గర 6,500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఆయన ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇక ఆయన బిజినెస్ ల ద్వారా, యాడ్ ఫిల్మ్స్ ద్వారా, సినిమాల ద్వారా సంవత్సరానికి 500 కోట్ల రూపాయలను పొందుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక షారుఖ్ ఖాన్ కి ఉన్న క్రేజ్ ని బట్టి ఆయన చాలా బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒక యాడ్ ఫిల్మ్ లో నటించినందుకు ఆయన దాదాపు 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ టీమ్ గా కొనసాగుతున్న కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ కి యాజమానికి కూడా కొనసాగుతున్నాడు.ఇప్పటికే కలకత్తా మూడుసార్లు ఐపిఎల్ టైటిల్ ని గెలిచుకుంది…ఈ టీమ్ ద్వారా కూడా ఆయన చాలా డబ్బులను పొందుతున్నాడు.ఇక ఇవే కాకుండా షారూఖ్ ఖాన్ కు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది.ఈ నిర్మాణ సంస్థలో కూడా భారీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు దీని ద్వారా కూడా ఆయన చాలా ప్రాఫిట్స్ అందుకుంటూ ఉంటాడు…

ఇక షారూఖ్ ఖాన్ దగ్గర అత్యంత విలువైన కార్లు కూడా ఉన్నాయి. అతని వద్ద ఉన్న మొత్తం కార్ల ఖరీదు వచ్చేసి 32 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది.అలాగే షారూఖ్‌ ఖాన్ కి విలాసవంతమైన క్యారవ్యాన్ కూడా ఉంది. దీని ధర 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది…ఇక షారుఖ్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల పరంగా చాలా వెనకబడి ఉన్నాడు ఆయన చేసిన సినిమాలు అంత పెద్ద విజయం సాధించ లేకపోతున్నాయి… ఇక ఇలాంటి క్రమంలో ఆయన రీసెంట్ గా తమిళ్ దర్శకుడు అయిన అట్లీ డైరెక్షన్ లో జవాన్ అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు…దాంతో మళ్ళీ స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు…