Allu Arjun Atlee movie teaser: ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) తో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిన్నగాక మొన్ననే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టుగా అనిపిస్తుంది. కానీ అప్పుడే 40 శాతం కి పైగా టాకీ పార్ట్ కూడా పూర్తి అయ్యిందట. ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ తన సినిమాల ఔట్పుట్ విషయం లో బాగా చొరవ తీసుకుంటున్నాడు. తనకు ఏదైనా నచ్చకపోతే, డైరెక్టర్ కి నేరుగా చెప్పి, రీ షూట్ చేయించడం వంటివి చేస్తున్నాడు. అట్లీ ఇప్పటి వరకు తీసిన ఔట్పుట్ పై అల్లు అర్జున్ సంతృప్తి గానే ఉన్నాడు. కానీ ఎందుకో కొన్ని సన్నివేశాలు ఇంకా పర్ఫెక్షన్ తో తీసుంటే బాగుండేది అని అనిపించిందట. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, చిన్న చిన్న విషయాల్లో కూడా వెనక్కి తగ్గకూడదు అనేదే అల్లు అర్జున్ కోరిక.
తనకు అనిపించినవి అట్లీ కి ఆయన చెప్పడం. అందుకు అట్లీ కూడా ఒప్పుకొని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేద్దామని అనడం, అందుకు నిర్మాత కూడా సానూకూలంగా స్పందించడం వంటివి జరిగాయట. అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్నటువంటి అద్భుతమైన క్రేజ్ , మార్కెట్ కి ఎంత బడ్జెట్ పెట్టడానికి అయినా రెడీ అనే విధంగా సన్ పిక్చర్స్ సంస్థ ఉన్నప్పుడు, ఇక డైరెక్టర్ అట్లీ ఎలా సైలెంట్ గా ఉంటాడు చెప్పండి?, అందుకే ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని తన విజన్ కి తగ్గట్టు వచ్చేదాకా చిక్కుతునే ఉండేలా ఉన్నాడు అట్లీ. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారట.
అప్పటి లోపు సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసి ఉంటుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడని కొందరు, త్రిపాత్రాభినయం లో కనిపించబోతున్నాడని మరికొందరు సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు. దీనిపై స్పష్టమైన క్లారిటీ అయితే లేదు కానీ, ఆయన మల్టిపుల్ రోల్స్ లో కనిపించబోతున్నాడు అనేది మాత్రం నిజమే. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారు నటిస్తున్నారు. వీరితో పాటు నేషనల్ క్రష్ రష్మిక ఇందులో విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ మొత్తాన్ని హాలీవుడ్ స్టూడియోస్ చేత చేయిస్తున్నారు. అభిమానులకు థియేటర్ లో కూర్చున్నంతసేపు ఒక సరికొత్త లోకం లోకి ప్రవేశించినట్టు చేయడమే డైరెక్టర్ అట్లీ లక్ష్యమట.