Pawan Kalyan and Lokesh Kanagaraj movie: తన కెరీర్ మొత్తం మీద పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొత్త డైరెక్టర్స్ తో, లేదా తనకు అనుకూలంగా ఉండే తమిళ డైరెక్టర్స్ తో పని చేసేవాడు కానీ, స్టార్ డైరెక్టర్స్ తో పని చేయడం మాత్రం చాలా తక్కువ. ఇప్పటి వరకు స్టార్ డైరెక్టర్స్ లో ఆయన కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాత్రమే పని చేశాడు. ఆయన సాధారణమైన డైరెక్టర్స్ తో పని చేస్తేనే భారీ అంచనాలతో సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాంటిది పాన్ ఇండియన్ డైరెక్టర్ తో పని చేస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి?, త్వరలోనే అది కూడా జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రాబోతుంది అనే వార్తను గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. సోషల్ మీడియా ని ఒక విధంగా ఈ వార్త షేక్ చేసింది అనే చెప్పాలి.
KVN ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే 20 రోజుల క్రితం లోకేష్ కనకరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) కి కూడా ఒక కథని వినిపించాడు. ఇది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ముందు మొదలు అవుతుందా?, లేదా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ముందు మొదలు అవుతుందా అనే దానిపై స్పష్టమైన క్లారిటీ లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో ఒక సినిమా చేస్తున్నాడు. కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అయ్యింది. మిగిలిన షూటింగ్ మొత్తం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పూర్తి చేయనున్నారు. లోకేష్ కనకరాజ్ ముందు అల్లు అర్జున్ తో పని చేయడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ ఉన్నాడు, వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ వరకు ఆయన అందుబాటులో ఉండదు కాబట్టి.
అంతే కాకుండా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉండడం, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మార్కెట్ లేకపోవడం వల్ల,లోకేష్ ముందుగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడట. కానీ అల్లు అర్జున్ వైపు నుండి ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నెలలో ఆయన నుండి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోతే, తన ద్రుష్టి మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాపై పెడతాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఒకవేళ అల్లు అర్జున్ ఒప్పుకుంటే ముందు అతని సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెడుతాడు. ఏమి జరగబోతుంది అనేది అల్లు అర్జున్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది.