#90’s A Middle Class : జబర్దస్త్ వల్ల రాని గుర్తింపు ‘#90`s ఏ మిడిల్ క్లాస్’ తోనే వచ్చిందట

థ విని క్యారెక్టర్ అడిగితే ఆడిషన్ చేసి తీసుకున్నారట. ఇదిలా ఉంటే తన స్వస్థలం కామారెడ్డి అని. ఇంటర్ లో ఇండస్ట్రీ పై ఆసక్తి పెరిగిందని సందీప్ అన్నారు

Written By: NARESH, Updated On : February 6, 2024 12:52 pm
Follow us on

#90’s A Middle Class’ : జబర్దస్త్ ద్వారా ఎంతో మందికి గుర్తింపు వస్తుంది. కానీ కొందరు సైడ్ క్యారెక్టర్ లకు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాదనేది కూడా వాస్తవమే. కొందరు మాత్రమే స్టార్లుగా ఎదిగితే మరికొందరు నార్మల్ గా ఉండిపోతారు. ఇదిలా ఉంటే ఇందులో నుంచి వెళ్లిన ఓ స్టార్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన వెబ్ సిరీస్ లలో #90`s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఒకటి.

ఈ సినిమాలోని ప్రతి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి కూడా. ఇక ఈటీవీ విన్ యాప్ కు ఊహించని స్థాయిలో సబ్ స్కైబర్స్ పెరగడంలో ఈ వెబ్ సిరీస్ కీలక పాత్ర పోషించింది. అయితే దీనికి సీక్వెల్ ఉండబోతుందని టాక్. 1990 నుంచి 2000 వరకు మధ్య పుట్టిన వ్యక్తుల రియల్ లైఫ్ ను ప్రతిబింబించేలా ఉండడంతో మరింత ప్లస్ అయింది. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన నటుడు సందీప్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఈయన వల్ల ఆ వెబ్ సిరీస్ కు మరింత ప్లస్ అయింది అని చెప్పడంలో సందేహం లేదు.

సందీప్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెబ్ సిరీస్ లో నేను చెప్పిన డైలాగ్స్ ప్రతి 10వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో ఉంటాయని పేర్కొన్నారు. వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తన రూమ్ మేట్ అని వెల్లడించారు సందీప్. అయితే ఈయన జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేశారట. అయితే ఈ అవకాశం మాత్రం డైరెక్టర్ తో స్నేహం చేయడం వల్లనే వచ్చింది అంటారు సందీప్. ఆదిత్య హాసన్ కథలు చెప్పేవాడని ఆయన కథలు విని షాకయ్యేవాడిని అని పేర్కొన్నారు సందీప్.

కథ విని క్యారెక్టర్ అడిగితే ఆడిషన్ చేసి తీసుకున్నారట. ఇదిలా ఉంటే తన స్వస్థలం కామారెడ్డి అని. ఇంటర్ లో ఇండస్ట్రీ పై ఆసక్తి పెరిగిందని సందీప్ అన్నారు. ఈయనకు చలాకీ చంటి ఛాన్స్ ఇవ్వడం వల్ల జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చానని.. మొదట్లో అందులో స్కిట్లు రాశానని వెల్లడించారు సందీప్. కానీ ఈ జబర్దస్త్ వల్ల రాని గుర్తింపు మాత్రం #90`s ఏ మిడిల్ క్లాస్ లోనే వచ్చిందని పేర్కొన్నారు.