Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస విజయాలను అందుకుంటు ముందుకు సాగాడు. ఇక ఇలాంటి మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు ఇప్పటివరకు తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారి కూడా ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోలేదు. తన పని ఏంటో తను చేసుకుంటూ ముందుకు సాగుతుంటాడు.
అయితే మహేష్ బాబుతో ఒక సినిమా చేసి సక్సెస్ ని సాధించిన వాళ్లను మాత్రం మహేష్ బాబు వదులుకోడు. వాళ్లకు మరో సినిమా ఇచ్చి ఆ సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని వాళ్లతో చెబుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందించిన పూరి జగన్నాథ్ తో సైతం మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య కొన్ని క్లాశేష్ అయితే ఉన్నాయి. దాంతో పూరి జగన్నాథ్ ను మహేష్ బాబు పూర్తిగా పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం అతనితో మాట్లాడడానికి కూడా మహేష్ బాబు పెదగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట… ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఒక క్లాసికల్ హిట్ ను అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల…
ఆ సినిమా తర్వాత ఆయన బ్రహ్మోత్సవం అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో మహేష్ బాబు కు భారీ డిజాస్టర్ ని అందించాడు. దాంతో శ్రీకాంత్ అడ్డాలతో సైతం మహేష్ బాబు పెద్దగా కమ్యూనికేట్ అవ్వడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తనకి సక్సెస్ లను అందించిన దర్శకులతో మాత్రమే ఎక్కువ రోజులపాటు ట్రావెల్ అవుతాడని ప్లాపులు ఇచ్చిన దర్శకులను పెద్దగా పట్టించుకోడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…