Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi : సీఎంతో కీలక భేటీకి చిరంజీవి రాకపోవడానికి కారణం? టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ సర్కార్,...

Chiranjeevi : సీఎంతో కీలక భేటీకి చిరంజీవి రాకపోవడానికి కారణం? టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ సర్కార్, ఏం జరగనుంది?

Chiranjeevi :  ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ దిల్‌ రాజు సారథ్యంలో నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇండస్టీ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ మీటింగులో హీరోలు నాగార్జున, వెంకటేష్‌, నితిన్‌, వరుణ్‌ తేజ్‌, కిరణ్‌ అబ్బవరం, శివబాలాజీ పాల్గొంటున్నారు. అలాగే దర్శకులు.. త్రివిక్రమ్‌, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, బాబీ, బలగం వేణు, వంశీ, బోయపాటి శ్రీను ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్‌బాబు, సునీల్‌ నారంగ్‌, నాగవంశీ, రవి శంకర్‌, దామోదర ప్రసాద్‌, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, సుప్రియ, నవీన్‌ ఎర్నేని ఉన్నారు.

ఇక ప్రభుత్వం నుంచి సీఎం, భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, డీజీపీ, ప్రిన్సపల్‌ సెక్రెటరీ రవి గుప్తా, ఇతర అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు రానున్నాయి. టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు పై పునరాలోచన చేయాలని సీఎం ని అభ్యర్థించే అవకాశం కలదు. అలాగే హీరోల ర్యాలీలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వద్ద భద్రతా ఏర్పాట్లు వంటి విషయాలు కూడా చర్చించనున్నారు.

పరిశ్రమకు చెందిన ఈ భేటీలో చిరంజీవి పాల్గొనకపోవడం చర్చకు దారి తీసింది. పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా.. చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తారు. కరోనా సంక్షోభం, ఏపీలో టికెట్స్ ధరల తగ్గింపు వంటి సమస్యల పరిష్కారానికి చిరంజీవి కృషి చేశారు. ఆయన నేతృత్వంలో కీలక విషయాలు చోటు చేసుకున్నాయి. ఇక అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా తెలంగాణ గవర్నమెంట్ వ్యవహరిస్తోంది. ఇబ్బందులకు గురి చేస్తుందనే వాదన ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తీరు నచ్చని మెగా హీరోలు ఈ భేటీకి దూరమయ్యారనే వాదన ఉంది. మొత్తంగా కీలక భేటీని చిరంజీవి అవైడ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

 

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version