Chiranjeevi : ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్ రాజు సారథ్యంలో నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇండస్టీ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ మీటింగులో హీరోలు నాగార్జున, వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ పాల్గొంటున్నారు. అలాగే దర్శకులు.. త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, బలగం వేణు, వంశీ, బోయపాటి శ్రీను ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సునీల్ నారంగ్, నాగవంశీ, రవి శంకర్, దామోదర ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సుప్రియ, నవీన్ ఎర్నేని ఉన్నారు.
ఇక ప్రభుత్వం నుంచి సీఎం, భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, డీజీపీ, ప్రిన్సపల్ సెక్రెటరీ రవి గుప్తా, ఇతర అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు రానున్నాయి. టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు పై పునరాలోచన చేయాలని సీఎం ని అభ్యర్థించే అవకాశం కలదు. అలాగే హీరోల ర్యాలీలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వద్ద భద్రతా ఏర్పాట్లు వంటి విషయాలు కూడా చర్చించనున్నారు.
పరిశ్రమకు చెందిన ఈ భేటీలో చిరంజీవి పాల్గొనకపోవడం చర్చకు దారి తీసింది. పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా.. చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తారు. కరోనా సంక్షోభం, ఏపీలో టికెట్స్ ధరల తగ్గింపు వంటి సమస్యల పరిష్కారానికి చిరంజీవి కృషి చేశారు. ఆయన నేతృత్వంలో కీలక విషయాలు చోటు చేసుకున్నాయి. ఇక అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా తెలంగాణ గవర్నమెంట్ వ్యవహరిస్తోంది. ఇబ్బందులకు గురి చేస్తుందనే వాదన ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తీరు నచ్చని మెగా హీరోలు ఈ భేటీకి దూరమయ్యారనే వాదన ఉంది. మొత్తంగా కీలక భేటీని చిరంజీవి అవైడ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.