Manisharma: మెగాస్టార్ ఫ్యాన్స్ ఇప్పటికి ఎప్పటికి మర్చిపోలేని చేదు జ్ఞాపకం ‘ఆచార్య’ చిత్రం..చిరంజీవి కెరీర్ లో అంతకు ముందు ఎన్ని ఫ్లాప్స్ అయినా ఉండొచ్చు..భవిష్యత్తులో కూడా ఫ్లాప్స్ రావొచ్చు..కానీ ఆచార్య సినిమా చేసినంత గాయం భవిష్యత్తులో ఏ సినిమా కూడా చెయ్యలేదని కుండబద్దలు కొట్టిమరీ చెప్తున్నారు విశ్లేషకులు..ఎందుకంటే ఇందులో చిరంజీవి తో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఉన్నాడు..పైగా #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా ఇదే.

కాబట్టి అభిమానుల్లో తండ్రి కొడుకులను మొట్టమొదటిసారి ఒక పూర్తి స్థాయి సినిమాలో చూడబోతున్నాము అనే కుతూహలం ఉండేది..అలా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా చిరంజీవి మరియు రామ్ చరణ్ కెరీర్ లోనే అతి చెత్త సినిమా గా నిలిచింది..కొరటాల శివ లాంటి దర్శకుడి నుండి ఇలాంటి చెత్త సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు..ఆచార్య కి ముందు ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టే..అలాంటి ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ చేతిలో పెడితే మెగా అభిమానులకు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇస్తారనుకున్నారు ఫ్యాన్స్..కానీ మర్చిపోలేని డిజాస్టర్ ఇచ్చాడు.
ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన మణిశర్మ ఇటీవలే అలీతో సరదాగా అనే ప్రోగ్రాం లో పాల్గొన్నాడు..ఈ ప్రోగ్రాం లో ఆచార్య సినిమా గురించి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ముందుగా అలీ మణిశర్మ తో మాట్లాడుతూ ‘ఆచార్య సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా ఇవ్వలేదని మీ మీద ఫ్యాన్స్ నుండి ఒక ఆరోపణ ఉంది..ఎందుకలా జరిగింది అంటారు’ అని అడుగుతాడు.

అప్పుడు మణిశర్మ ‘సినిమాలో రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాను..దాని గిరించి అడగొచ్చు గా అంటాడు’..అప్పుడు అలీ ‘సాంగ్స్ బాగున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా రాలేదని నాకు కూడా అనిపించింది’ అని అడగగా దానికి మణిశర్మ సమాధానం ఇస్తూ ‘ముందుగా నేను ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెర్షన్ ని సిద్ధం చేసి పెట్టుకొని డైరెక్టర్ గారికి వినిపించాను..అతను ఇలా కాదు కొత్తగా చేద్దాం అని చెప్పి నా చేత ఇలా కొట్టించాడు..సినిమాలో ఒక్క మ్యూజిక్ పరంగా మాత్రమే కాదు..చాలా విషయాల్లో కొరటాల శివ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు..అందుకే ఆ ఫలితం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు మణిశర్మ.
https://www.youtube.com/watch?v=A1XzakSvBWM