Guntur Kaaram: పండగ ముగిసింది… ఇక గుంటూరు కారం కి అసలైన పరీక్ష మొదలైంది…

ముఖ్యంగా గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటివరకు ఆంధ్రలో 48 కోట్లు, నైజాంలో 40 కోట్లు, సీడెడ్ లో 15 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Written By: Gopi, Updated On : January 17, 2024 12:31 pm

Guntur Kaaram USA Review

Follow us on

Guntur Kaaram: ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రేక్షకులు ఎప్పుడో తేల్చేశారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమా రిలీజ్ అయితే అందులో హనుమాన్ సినిమా ఒక్కటే మంచి పేరు సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇక గుంటూరు కారం సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయని సినిమా యూనిట్ అయితే ప్రచారం చేస్తుంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ ని బాగానే రాబట్టినప్పటికీ ఇక పండుగ ముగిసింది. పిల్లలు స్కూల్స్ కి వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్తారు, ఊరు వచ్చిన వాళ్ళు తిరిగి వాళ్ళ ఉర్లకి వెళ్లి పోతారు.కాబట్టి ఇలాంటి సమయంలో జనాలు ఈ సినిమాలను పట్టించుకునే అవకాశాలు చాలా తక్కువ…ఒక వేళ పట్టించుకున్న కూడా సక్సెస్ ఫుల్ టాక్ వచ్చిన సినిమాని మాత్రమే జనాలు చూడటానికి ఇష్టపడుతారు. ఇక అందులో భాగంగానే సంక్రాంతి పండుగకి అన్ని సినిమాలకి టికెట్ల రేట్ పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు పండగ సీజన్ ముగిసింది కాబట్టి ఆ రేట్లని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో ఈ సినిమాలు ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడతాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.

ముఖ్యంగా గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటివరకు ఆంధ్రలో 48 కోట్లు, నైజాంలో 40 కోట్లు, సీడెడ్ లో 15 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పటివరకు ఈ సినిమా సగం కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక మిగిలిన సగం రాబట్టాల్సి ఉంది. అయినప్పటికీ ఈ వసూళ్లలో చాలా మేరకు గవర్నమెంట్ కి జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా కి డివైడ్ టాక్ వచ్చింది అయినప్పటికీ మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాని చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే మెజార్టీ ఆఫ్ మెంబర్స్ సంక్రాంతి పండగ రోజుల్లోనే ఈ సినిమాను చూసేశారు. ఇక ఇప్పుడు సామాన్య జనాలు ఈ సినిమాని చూడాలి అంటే చాలా కష్టం అలాగే ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో ఆడే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఆ థియేటర్ యాజమాన్యం లాస్ ల్లో ఉండి కూడా ఈ సినిమాలు నడిపించుకోలేదు.

కాబట్టి ఏ సినిమాకు అయితే ఎక్కువ సక్సెస్ టాక్ వచ్చిందో ఆ సినిమాను మాత్రమే వాళ్ళు థియేటర్ లో ఆడించడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. కాబట్టి డివైడ్ టాక్ వచ్చిన గుంటూరు కారం సినిమాని చాలా థియేటర్ల నుంచి తీసేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ సినిమాకి ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంత పెద్ద సినిమా తీసి కూడా ప్రొడ్యూసర్స్ వాళ్ల బ్యానర్ లో ఒక ప్లాప్ ని మూట గట్టుకొని, నష్టాలను చవి చూడాల్సి వస్తుంది అంటే ఇది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…