The Rajasaab Rating: కొన్ని సినిమాలను మన ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటారు. అలాంటి ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ‘రాజా'(Raja Movie). విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), సౌందర్య కాంబినేషన్ లో ముప్పలనేని శివ దర్శకత్వం లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం, ఆరోజుల్లో కలెక్షన్స్ పరంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లోనే ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది. థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, టీవీ టెలికాస్ట్ లో అంతకు మించి హిట్ అయ్యింది. ఇలాంటి టీవీ బ్లాక్ బస్టర్ భవిష్యత్తులో కూడా మనం చూడలేము ఏమో. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని జెమినీ టీవీ లో టెలికాస్ట్.
ఈమధ్య కాలంలో ప్రసారం చేసిన అన్ని కొత్త సినిమాలకంటే, ఈ సినిమాకే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. జెమినీ టీవీ కి భారీ లాభాలను తెచ్చిపెట్టారు. BAARC సంస్థ విడుదల చేసిన టీఆర్ఫీ రేటింగ్స్ ప్రకారం చూస్తే, ఈ సినిమాకు లేటెస్ట్ టెలికాస్ట్ లో 7.45 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయట. ఇది ఒక సెన్సేషనల్ రికార్డు గా పరిగణించొచ్చు. గత ఏడాది విడుదలైన సూపర్ హిట్ సినిమాలను టెలికాస్ట్ చేసినప్పుడు కూడా ఈ రేంజ్ రేటింగ్స్ రాలేదని, ‘రాజా’ సినిమాని టెలికాస్ట్ చేసిన ప్రతీసారీ అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అవుతున్నాయని అంటున్నారు. ఈమధ్య కాలం లోనే మరోసారి ఈ సినిమాని జెమినీ టీవీ లో టెలికాస్ట్ గా 6 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇలా టెలికాస్ట్ చేసిన ప్రతీసారీ ఈ చిత్రానికి 5 కి తక్కువ లేకుండా టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అవుతున్నాయి.
26 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమాని ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసిన మన తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే జెమినీ టీవీ కూడా ఆ చిత్ర నిర్మాతలతో ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ని అప్ గ్రేడ్ చేసుకుంటే ఉంది. ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి అగ్రేఈమెంట్ ని అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోకపోతే, సాటిలైట్ రైట్స్ ని సదరు టీవీ చానెల్స్ కోల్పోవాల్సి వస్తుంది. అలా ఎన్నో సినిమాలు ఒక ఛానల్ నుండి మరో ఛానల్ కి షిఫ్ట్ అయ్యినవి ఉన్నాయి. కానీ జెమినీ టీవీ వారు మాత్రం ‘రాజా’ రైట్స్ ని వదులుకోవడం లేదు. మరో 26 ఏళ్ళ పాటు ఆడియన్స్ లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చెక్కు చెదరదు అనే బలమైన నమ్మకం ఆ ఛానల్ యాజమాన్యం లో ఉంది.