The Raja Saab Trailer: సాధారణంగా ఏ సినిమాకు అయినా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదలకు వారం రోజులు ముందు కానీ, లేదా పది రోజుల ముందు కానీ వదలడం మనం చూస్తూ ఉంటాము. కానీ జనవరి నెలలో విడుదల అవ్వబోయే ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రానికి మాత్రం రేపే విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇలా జరగడం టాలీవుడ్ హిస్టరీ లో ఇదే తొలిసారి. ఇంత తొందరగా విడుదల చేయడానికి గల కారణాలు ఏంటి ?, సినిమాకు అనుకున్న స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదా?, ట్రైలర్ ద్వారా తమ సినిమా ఎంత గొప్పగా ఉండబోతుందో చూపించి బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. మధ్యలో కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది, మళ్లీ మొదలైంది, ఇలా ఉండడం వల్ల ఈ చిత్రం పై క్రేజ్ బాగా పడిపోయింది.
ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ, సాధారణ ఆడియన్స్ లో మాత్రం అనుకున్న రేంజ్ క్రేజ్ లేదు. అందుకే రేపు ట్రైలర్ ని విడుదల చేస్తున్నారని, ఈ ట్రైలర్ ని అక్టోబర్ 2న విడుదల అవ్వబోయే ‘కాంతారా 2’ చిత్రానికి కూడా జత చేస్తారని టాక్. ఈ ట్రైలర్ లోనే ప్రభాస్ లో ఫ్యాన్స్, ఆడియన్స్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని సరికొత్త యాంగిల్ ని చూడబోతున్నారట ఆడియన్స్. అంటే ఆయనలోని కామెడీ టైమింగ్ ని ఆ రేంజ్ లో వాడారు అన్నమాట. ఈ విషయాన్నీ స్వయంగా ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ప్రభాస్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంది అనే విషయం మనకి బుజ్జిగాడు సినిమా సమయం లో తెలుసు, కానీ పూర్తి స్థాయి కామెడీ రోల్ మాత్రం ఆయన ‘రాజా సాబ్’ లోనే చేసాడు.
థమన్ కూడా కొన్ని సన్నివేశాలు చూసి షాక్ అయ్యాడట. ఇదేంటి ప్రభాస్ నుండి ఇలాంటి యాక్టింగ్ ని ఎలా రాబట్టావు అని డైరెక్టర్ మారుతీ ని అడిగాను, నన్ను గట్టిగా నమ్మేశాడని మారుతీ చెప్పాడట. మరి ఒక స్టార్ హీరో రీసెంట్ సమయం లో హారర్ థ్రిల్లర్ జానర్ లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ప్రభాస్ ఆ విధంగా పెద్ద రిస్క్ చేసినట్టే, దానికి తోడు మంచి యాక్షన్ హీరో ఇమేజ్ కూడా ఉంది. ఇలాంటి హీరో ని కామెడీ యాంగిల్ లో చూపిస్తే అభిమానులు తీసుకోగలరా? అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఏ మాత్రం తేడా జరిగిన సినిమా ఫలితం తారుమారు అవుతుందట. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.
The GATES of FEAR are opening…
Enter if you dare #TheRajaSaabTRAILER on SEP 29th, 6PM #TheRajaSaab #Prabhas pic.twitter.com/8wuQO2Webl— The RajaSaab (@rajasaabmovie) September 28, 2025