The Raja Saab Story: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘రాజా సాబ్'(The Rajasaab movie) చిత్రం మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే రిలీజ్ ట్రైలర్ వచ్చిందో, అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల వరకు ఈ చిత్రానికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ జనాలు మాత్రం ఇంకా ఈ సినిమా పై హైప్ అవ్వలేదు. నార్త్ అమెరికా లో ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి కానీ, ప్రభాస్ రేంజ్ లో అయితే లేదు. ఇకపోతే ఈ సినిమాలు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి . డైరెక్టర్ మారుతీ అయితే వరుసగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాడు.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన రాజా సాబ్ మూవీ స్టోరీ లైన్ గురించి చెప్పుకొచ్చాడు. ముందుగా ఈ సినిమాని హారర్ కామెడీ గా తీర్చిదిద్దాలని అనుకున్నారట , కానీ చివరికి అది హారర్ ఫాంటసీ అయ్యిందని అంటున్నాడు. ప్రభాస్ ఈ సినిమా కోసం తన స్టార్ స్టేటస్ ని పూర్తిగా పక్కన పెట్టాడని, ఒకే తరహా పాత్రలు చేయడం తనకు బాగా బోర్ కొట్టేసిందని, అందుకే కాస్త డిఫరెంట్ తరహా పాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని , అందులో భాగంగానే ఈ రాజాసాబ్ చిత్రం వచ్చిందని, ప్రభాస్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని చూసే ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతారని, ఆ రేంజ్ లో ఔట్పుట్ వచ్చిందంటూ చెప్పుజేకొచ్చాడు మారుతి. ఇక ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో క్లైమాక్స్ పార్ట్ ఒక్కటే 40 నిమిషాలకు పైగా ఉంటుందట. ఇది ఆడియన్స్ కి అనుక్షణం గూస్ బంప్స్ రప్పించేలా ఉంటుందని అంటున్నారు.
మొదట్లో ‘రాజా సాబ్’ సినిమా ఒప్పుకున్నప్పుడు, వరుసగా అంత పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ వెళ్తున్న ప్రభాస్ అకస్మాత్తుగా ఇలా చిన్న సినిమా చేయడం ఏంటి?, రాజా సాబ్ ని ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేసాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సైతం మండిపడ్డారు. కానీ ఇది చిన్న సినిమా కాదని, ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం మూడేళ్ళ సమయం పట్టిందని, బడ్జెట్ 300 కోట్లు దాటిందని మారుతి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గానే హైదరాబాద్ లో చేశారు మేకర్స్, రెండవ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆంధ్ర ప్రదేశ్ లో ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.