Ananya Panday: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు, స్టార్ డైరక్టర్లకు ముందుగానే భారీ మొత్తంలో డబ్బులు అడ్వాన్స్ గా అందించడం, అవి కాస్త చివరకు బ్లాక్ అయిపోవడం నిర్మాతలకు అలవాటు అయిపోయింది. చివరకు ఈ అడ్వాన్స్ లకు వడ్డీ కట్టుకోలేక చాలా మంది నిర్మాతలు సినిమాలు చేయడం కూడా మానేశారు. ఇక ఈ అడ్వాన్స్ లను వెనక్కి ఇవ్వకుండా క్యాష్ చేసుకునే హీరోలు, డైరెక్టర్లు చాలామందే ఉన్నారు.

ఓ మిడిల్ రేంజ్ నిర్మాత, లైగర్ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, ఆ సినిమాలో నటించిన అనన్య పాండే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకుని.. ఆ మిడిల్ రేంజ్ నిర్మాత, ఆమెకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఈ లోగా లైగర్ రూపంలో అనన్య పాండేకి డిజాస్టర్ పలకరించింది. దాంతో ఆమె రేంజ్ పూర్తిగా పడిపోయింది.
ప్రస్తుతం ఆమె వైపు డైరక్టర్లు చూడడం మానేసారు. వేరే భాషలో అయినా అనన్య పాండేకి ఛాన్స్ లు వస్తున్నాయా అంటే.. అదీ లేదు. చివరకు లోకల్ హీరోయిన్ గా కూడా అనన్య పాండే సక్సెస్ కాలేకపోయింది. ఆమెకు ఏ సినిమా సెట్ కావడం లేదు. మొత్తానికి అనన్యకి ఇప్పుడు సినిమా అన్నది దూరంగా ఉండిపోయింది. మరి ఈ క్రమంలో ఆ మిడిల్ రేంజ్ నిర్మాత ఏం చేయాలి ?,
రీసెంట్ గా అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడట. అదేంటి ? సినిమా చేద్దాం అని కబుర్లు చెబుతుంది అనన్య. అయినా, ఒకసారి అడ్వాన్స్ ఇచ్చాక, ఎవరు మాత్రం ఎందుకు తిరిగి ఇస్తారు. సినిమా చేస్తా..కథ, డైరక్టర్ ను పట్టుకుని రండి అంటారు. ఆయన వుంటే…అన్న సామెత మాదిరిగా తయారైంది ప్రస్తుతం ఆ మిడిల్ రేంజ్ నిర్మాత వ్యవహారం. కానీ ఏం చేస్తాడు ?, అనన్య నుండి రూపాయి కూడా రాబట్టుకోలేడు.

అలా అని ఆమెతో సినిమానూ చేయలేడు. ఎలాగూ అనన్య మీద ఏ కథ, ఏ డైరక్టర్ సెట్ కాడు. సెట్ అయినా భారీ మొత్తంలో డబ్బులు లైన్ లో పడి సినిమాగా మారవు. లేదా, పెట్టిన డబ్బులు వెనక్కు రావు. ఈ లోగా ఆమెకు ఇచ్చిన కోటికి వడ్డీలు కట్టుకుంటూ కూర్చోవడమే ఆ నిర్మాత పని. పాపం.. ఇలాంటి నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు.
Also Read: Mahesh Babu Daughter Sitara Crying: వీడియో: వెక్కివెక్కి ఏడ్చిన సితార.. ఓదార్చిన మహేష్, నమ్రత
[…] […]
[…] Also Read: Ananya Panday: The producer who paid crores to the heroine! […]
[…] […]