PRO system in film industry: టాలీవుడ్ లో ప్రతీ స్టార్ నిర్మాతకు ఒక PRO ఉంటారు. అనగా తమ సినిమాకు విడుదలకు ముందు చేయాల్సిన ప్రొమోషన్స్ మొత్తం మీడియాలో.. సోషల్ మిడియా లో చేయడం, తద్వారా ఒక సినిమాపై ఆడియన్స్ లో హైప్ లేదా మంచి పాజిటివ్ బజ్ ని తీసుకొని రావడం. ఇందుకోసం నిర్మాతల దగ్గర భారీ రేంజ్ లో డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది కూడా ఇప్పుడు పెద్ద మాఫియా అయిపోయింది. కొంతమంది PRO లు అందినంత డబ్బులు నిర్మాతల నుండి తీసుకుంటున్నారు కానీ, ప్రొమోషన్స్ చేయడం లేదు. ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో వచ్చే రివ్యూస్ ప్రతీ సినిమాపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. PRO లు సోషల్ మీడియా లో ఉండే పాపులర్ వెబ్ సైట్స్ కొన్నింటికి డబ్బులు ఇవ్వడం, కొన్ని పాపులర్ వెబ్ సైట్స్ ని పట్టించుకోకపోవడం వల్ల, ఆ సైట్స్ సినిమా పై నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం మొదలు పెడుతాయి.
ఈ నెగిటివ్ రివ్యూస్ సినిమా పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. పైగా ఈమధ్య కాలం లో కొంతమంది PRO లు తమ సినిమా ఎలా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా లోని సోషల్ మీడియా ఇన్ఫ్లయేన్సర్స్ కి డబ్బులిచ్చి పాజిటివ్ ట్వీట్స్ వేయిస్తూ ఉంటుంది. అదే సమయం లో తమకు గిట్టని సినిమాలను ట్రోల్ చేస్తూ విపరీతమైన నెగిటివిటీ ని ఒక సినిమాపై పెంచేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫ్లాప్స్ గా మిగిలిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక సినిమా భవిష్యత్తు ని ఇప్పుడు PRO వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఇది ఎంత వరకు కరెక్ట్ మీరే చెప్పండి?, సంవత్సరాల తరబడి ఎంతో శ్రమించి ఒక సినిమా తీస్తే, ఈ PRO లు కావాల్సినంత డబ్బులు తీసుకొని, తమకు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి నిర్మాతల రక్తం తాగేస్తున్నారు. కష్టపడి సినిమాలు చేసే హీరోలు, నిర్మాతలు, కష్టపడి ప్రొమోషన్స్ కూడా చేసుకోవచ్చు కదా?, ప్రొమోషన్స్ కోసం PRO లపైనే ఆధారపడాల్సిన అవసరం ఏంటి?.
బాలీవుడ్ లో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి వారు సినిమా కోసం ఎంతలా ప్రాణం పెట్టి పనిచేస్తారో, తమ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు ఏ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తారో మనం గతం లో చాలా సార్లు చూసాము. అమీర్ ఖాన్ అయితే తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మారు వేషం లో తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మన టాలీవుడ్ నిర్మాతలు ఎందుకు మన హీరోల చేత అంతలా కష్టపడి పని చేయించక్కర్లేదు, కనీస స్థాయిలో అయినా కష్టపడితే నేడు PRO వ్యవస్థ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా?, అలా ఎందుకు చేయడం లేదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో నిర్మాతలు ఒక కఠినమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ పీఆర్వోల వ్యవస్థ వల్ల మరింత భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.