YouTuber Anvesh: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్(Anvesh) పేరు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో మారుమోగిపోతూ ఉంది. ప్రముఖ నటుడు శివాజీ హీరోయిన్స్ దుస్తులను ఉద్దేశించి కామెంట్స్ చేయడం, దానికి కౌంటర్ గా అన్వేష్ మాట్లాడుతూ శివాజీ ని అత్యంత నీచమైన బూతులతో తిట్టడం, అక్కడితో ఆగకుండా చాగంటి కోటేశ్వర రావు ని తిట్టడం,హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని అనుసరించేవాళ్లను ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం వల్ల అతనిపై జనాలు ఆవేశం తో రగిలిపోతున్నారు. విదేశాల్లో కూర్చొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న అన్వేష్ ని ఇండియా కి తీసుకొని రావాలని, అతన్ని కచ్చితంగా శిక్షించాలని రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పోతుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్వేష్ పై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే ప్రముఖ నటి, బీజేపీ పార్టీ నాయకురాలు, కరాటీ కళ్యాణ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.
ఈ కంప్లైంట్ ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్వేష్ ని అన్వేషించడం లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అతని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజం పై విద్వేషాలు పెంచేలా చేస్తున్న అతగాడి ఇన్ స్టాగ్రామ్ ID ని తొలగించాలి అంటూ ఇన్ స్టాగ్రామ్ సంస్థకు లేఖ రాశారు. అదే విధంగా త్వరలోనే అన్వేష్ నిర్వహిసున్న ‘నా అన్వేషణ’, ‘ప్రపంచ యాత్రికుడు’ చానెల్స్ ని శాశ్వతంగా బ్యాన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు చానెల్స్ ని దాదాపుగా 40 లక్షల మంది అనుసరిస్తున్నారు. హిందూ దేవుళ్లపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలకు చిరాకు పడుతూ, ప్రతీ రోజు ఇతన్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు అన్న ఫాలో అవుతున్నారు. ఏది ఏమైనా నా అన్వేషణ చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అయినట్టే. రాబోయే రోజుల్లో ఇతను వీడియోలు చేసినా పట్టించుకునే వాళ్ళు ఉండరు.
ఇదంతా పక్కన పెడితే అన్వేష్ ని హైదరాబాద్ కి రప్పించేందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారట పోలీసులు. త్వరలోనే అన్వేష్ అరెస్ట్ అనే శుభవార్త ని వినొచ్చని అంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. అప్పుడే ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. సక్సెస్ ని సరిగా హ్యాండిల్ చేయకపోతే ఇలా అవ్వేష్ లాగా మిగిలిపోతారు. ఇతన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి వంటి ప్రముఖులు కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ఆ రేంజ్ కంటెంట్ గడిచిన నాలుగు సంవత్సరాలలో ఇచ్చాడు. ఎంతో కస్టపడి సంపాదించుకున్న పేరు, సంపద మొత్తం ఇప్పుడు నోటి దూలతో పోగొట్టుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.