Akhanda 2 Collection Day 1: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం మొన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులను ఎగురుకుంటూ వచ్చిన ఈ చిత్రం కనీసం ఔట్పుట్ తో అయినా సంతృప్తి పరుస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. ప్రీమియర్ షోస్ నుండి డివైడ్ టాల్క్ రావడం తో, ఆ టాక్ ప్రభావం మొదటి రోజు రెగ్యులర్ షోస్ పై బలంగా పడింది. స్పెషల్ షోస్, నూన్ షోస్ మరియు మ్యాట్నీ షోస్ దారుణమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకున్నాయి. బాలయ్య కి కంచుకోట గా పిలవబడే సీడెడ్, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఈ చిత్రానికి భారీ డ్రాప్స్ నమోదు అయ్యాయి. ఒక్కొక్క సెంటర్ లో స్టార్ హీరో రేంజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రానికి, ఇలాంటి ఓపెనింగ్ వచ్చిందేంటి అని బయ్యర్స్ కంగుతిన్నారు.
ఓపెనింగ్ వసూళ్లే ఇలా ఉంటే, ఇక ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం కదా, భలే దెబ్బ తిన్నామే అంటూ బాధపడ్డారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ వసూళ్లు 50 కోట్లకు చాలా దగ్గరగా ఉండొచ్చని అంటున్నారు. ఇంకా తక్కువ వసూళ్లే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే నిన్న ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ నుండి సినిమా పుంజుకుంది. అంటే పబ్లిక్ లో కచ్చితంగా ఈ సినిమాకు మంచి టాక్ ఉందేమో?, సోషల్ మీడియా లో ఇలాంటి మాస్ సినిమాలకు నెగిటివ్ టాక్ రావడం సహజమే, అఖండ చిత్రానికి కూడా సోషల్ మీడియా లో నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ ఫుల్ రన్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది, ఈ చిత్రానికి కూడా అదే రిపీట్ అవ్వోచ్చేమో అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.
బాలయ్య కి కంచుకోట గా పిలవబడే సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 20 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు రావాలి. అది దాదాపుగా అసాధ్యమే అనుకోవచ్చు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయిలు, ఆంధ్ర ప్రదేశ్ లో 8 కోట్ల రూపాయిలు, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వాచినట్టు తెలుస్తుంది. గ్రాస్ వసూళ్లు 50 కోట్ల వరకు ఉండొచ్చట.