The Paradise Sampoornesh Babu Look: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసర సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు లభించింది. దాంతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లోనే ప్యారడైజ్ అనే సినిమా రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా మీద శ్రీకాంత్ చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 1960, 70 సమయాల్లో హైదరాబాద్ లోని ప్యారడైజ్ అనే ఏరియా ని బేస్ చేసుకొని ఈ సినిమా ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఈ మూవీ గ్లింప్స్ చ్చినప్పటి నుంచే సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా చేస్తున్నాడు అంటూ తన పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సంపూర్ణేష్ బాబుకు సైతం ‘బిర్యానీ’ అనే ఒక పేరును ఫిక్స్ చేసి ఒక రగ్గుడ్ లుక్ లో అతన్ని చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సంపూ కంప్లీట్ ఒక రా క్యారెక్టర్ ని పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తన భుజాన గొడ్డలి పెట్టుకొని రక్తంతో ఉన్న అతని పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మొత్తానికైతే కామెడీ సినిమాలను చేస్తూ హీరోగా చెలామణి అవుతున్నా సంపూర్ణేష్ బాబు చేత ఒక రా క్యారెక్టర్ చేయించాలనే ఐడియా వచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపితే మాత్రం తను చేయబోయే చిరంజీవి సినిమాకి చాలా వరకు హెల్ప్ అవుతోంది. ఈ రకంగా ఈ సినిమాతో ఆయన తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డైలాగులు గాని, విజువల్స్ గాని చాలా పవర్ ఫుల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…