The Paradise Release Date: ‘దసరా’, ‘సరిపోదా శనివారం’,’హిట్ 3′ చిత్రాలతో మూడు సార్లు 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani), ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) చిత్రం తో ఏకంగా 200 కోట్ల గ్రాస్ ని టార్గెట్ చేసాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది. అంతే కాదు ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ వచ్చినా బాగా వైరల్ అయిపోతున్నాయి. ఈమధ్య కాలం లో ఒక మీడియం రేంజ్ హీరో సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం ఈ రేంజ్ లో మాట్లాడుకోవడం ఈ సినిమాకే జరిగింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేయబోతున్నాం అంటూ మేకర్స్ ఇది వరకే ఒక ప్రకటన చేశారు.
అయితే ఇప్పుడు ఆ తేదికి రావడం నూటికి నూరు శాతం అసాధ్యమని అంటున్నారు. షూటింగ్ కార్యక్రమాలు ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అత్యధిక శాతం రీ షూట్స్ కూడా జరుగుతున్నాయట. కాబట్టి ఈ సినిమా జూన్ 26 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో మంచు మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. చాలా విచిత్రం గా వీళ్ళ లుక్స్ ఉన్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు ని ఈ వయస్సు లో అలాంటి లుక్ లో చూస్తామని మనం కలలో కూడా ఊహించి ఉండము.
ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా కాయదు లోహర్ నటించనుంది అట. శ్రీకాంత్ ఓదెల ఎక్కడ కూడా తగ్గకుండా ఈ చిత్రం లోని ప్రతీ ఫ్రేమ్ ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ని ఇచేలా డిజైన్ చేస్తున్నాడట. ‘దసరా’ చిత్రం లోని శ్రీకాంత్ ఓదెల పెట్టిన కొన్ని ఫ్రేమ్స్ థియేటర్ లో చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. ఆ రేంజ్ లో తెరకెక్కించాడు. కచ్చితంగా విషయం ఉన్న కుర్రోడే, ఈ సినిమా తో పెద్ద హిట్ కొడితే, పాన్ ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోతాడు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.