The Paradise: వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో నాని(Natural Star Nani), ఇప్పుడు తన మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). తనతో గతం లో ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది. అయితే ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతుందని, ముందుగా చెప్పిన మార్చి 26 న ఈ సినిమా విడుదల అవ్వడం కష్టమే అని రకరకాల వార్తలు వచ్చాయి.
అయితే నేడు ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఒక వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో లో శ్రీకాంత్ మేకింగ్ ని చూపించారు. ఆయన ఎంత కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడో ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసాడు. ఈ వీడియో చివర్లో మార్చ్ 26 న ఈ చిత్రం విడుదల అవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది ‘ చిత్రం కూడా విడుదల అవ్వబోతుంది. ఈ రెండు సినిమాల పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. కానీ రెండు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలైతే రెండు సినిమాలకు నష్టాలే. ముఖ్యంగా రామ్ చరణ్ పెద్ద హీరో కాబట్టి, ఆయన సినిమాకు థియేటర్స్ భారీగా అవసరం ఉంటుంది.
మరి ఇప్పుడు ఏమి జరగబోతుంది?, పెద్ది సినిమా గత రెండు మూడు రోజుల క్రితం వాయిదా పడింది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమి లేదని , జనవరి నెలాఖరు లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని, కచ్చితంగా చెప్పిన డేట్ కి వస్తామని చెప్పుకొచ్చారు. మరి ఈ రెండు సినిమాలకు క్లాష్ పడితే ఎవరో ఒకరు వెనక్కి వెళ్లడమో, ముందుకు వెళ్లడమో చేయాలి. నాని మాత్రం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అనే మోడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అదే కనుక జరిగితే పెద్ది చిత్రం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.