https://oktelugu.com/

Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం’ ఓవర్సీస్ ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది..సినిమాలోని ప్లస్సులు..మైనస్సులు ఇవే!

కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ ప్రీమియర్ షో పూర్తి అయ్యింది. అక్కడి నుండి ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది?, సినిమాలోని ప్లస్సులు ఏమిటి?, మైనస్సులు ఏమిటి? అనేది ఇప్పుడు వివరంగా మనమంతా చూడబోతున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : January 13, 2025 / 08:24 PM IST

    Sankranthiki Vasthunnam Movi

    Follow us on

    Sankranthiki Vastunnam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం, దానికి తోడు సంక్రాంతి కానుకగా విడుదలైన మిగిలిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకుకోలేక పోవడంతో ప్రేక్షకులు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో షెడ్యూల్ చేసిన షోస్ అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. రెండవ రోజు కి సంబంధించిన బుకింగ్స్ కూడా చాలా స్పీడ్ గా ఉన్నాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    అయితే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ ప్రీమియర్ షో పూర్తి అయ్యింది. అక్కడి నుండి ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది?, సినిమాలోని ప్లస్సులు ఏమిటి?, మైనస్సులు ఏమిటి? అనేది ఇప్పుడు వివరంగా మనమంతా చూడబోతున్నాము. ఓవర్సీస్ టాక్ ప్రకారం ముందు నుండి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ఎలాంటి పాజిటివ్ బజ్ జనాల్లో ఉందో, అంతకు మించే ఈ చిత్రం ఉందని ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్తున్నారు. వింటేజ్ వెంకటేష్ కామెడీ ని మిస్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఈ సినిమా లో ఆ వింటేజ్ వెంకటేష్ ని చూడొచ్చని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ ఎలిమెంట్స్ తో నింపేసాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ చేత డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పించిన డైలాగ్స్ పెళ్ళైన ప్రతీ మగాడికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందట.

    ఇక సెకండ్ హాఫ్ లో ఫన్ తో పాటు, కాస్త ఎమోషనల్ సన్నివేశాలు కూడా బలంగా దట్టించాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసే విధంగా ఉంటుందట. సినిమాలో అసలు విలన్ ఎవరు అనేది అప్పుడే రివీల్ అవుతుందట. క్రైమ్ ఎలిమెంట్స్ తో, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ, ఫ్యామిలీ ఆడియన్స్ కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. విడుదలకు ముందు బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘గోదారి గట్టు మీద’ సాంగ్ వెండితెర పై ఇంకా అద్భుతంగా ఉంటుందట. థియేటర్స్ లో కడుపుబ్బా నవ్వుకున్న స్టార్ హీరో సినిమా వచ్చి చాలా రోజులైంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆ లోటుని పూడవనుంది. అన్ని కుదిరితే ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.