https://oktelugu.com/

Upendra : ఉపేంద్ర ‘UI’ మూవీ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఎందులో చూడాలంటే!

కన్నడ హీరో ఉపేంద్ర నటించిన UI చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 05:02 PM IST

    Upendra

    Follow us on

    Upendra : కన్నడ హీరో ఉపేంద్ర నటించిన UI చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర దర్శకత్వం లో వచ్చే సినిమా నుండి ఆడియన్స్ ఏవైతే కోరుకుంటారో, అవన్నీ ఈ సినిమాలో ఉండడంతో మంచి వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది ఈ చిత్రం ముందు వరకు కన్నడ పరిశ్రమ చాలా కష్టాల్లో ఉన్నింది. ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేక బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. అలాంటి సమయంలో విడుదలైన ఈ చిత్రం కన్నడ బాక్స్ ఆఫీస్ కి కాస్త ఊపిరి పోసింది. ఈ చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత వచ్చిన కిచ్చ సుదీప్ మ్యాక్స్ మూవీ కూడా మంచి వసూళ్లను అందుకుంది. ఇదంతా పక్కన పెడితే UI చిత్రం 13 రోజులకు గాను 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉపేంద్ర కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.

    ఇది ఇలా ఉండగా ఆడియన్స్ ‘పుష్ప 2 ‘ మేనియా లో ఉండడం వల్ల చాలా మంది ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయ్యారు. అలాంటోళ్ళు ఈ చిత్రం ఓటీటీ లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వాళ్లకి ఒక శుభవార్త. ఈ చిత్రం ఓటీటీ డిజిటల్ రైట్స్ ని సన్ నెక్స్ట్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల 30 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. తెలుగు తో పాటు, హిందీ , తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుతుందో చూడాలి.

    ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 35 కోట్ల రూపాయిల వరకు జరిగింది. అంటే కచ్చితంగా ఈ చిత్రం 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 42 కోట్లు మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని, క్లీన్ హిట్ స్టేటస్ ని దక్కించుకోవాలంటే మరో 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. కలెక్షన్స్ చాలా స్టడీ గా ఉన్నాయి కాబట్టి మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే సూచనలు ఉన్నాయి. అంతకు మించి రావడం కష్టమే. తెలుగు లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఫుల్ రన్ లో ఇంకో కోటి రూపాయిలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఓవర్సీస్ లో దాదాపుగా రెండు కోట్ల రూపాయిలు రాగా, నార్త్ ఇండియా లో కనీసం కోటి రూపాయిల గ్రాస్ ని కూడా సొంతం చేసుకోలేదు.