Jr.NTR : పాన్ ఇండియా లెవెల్ లో మంచి మార్కెట్, గుర్తింపు ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. అంతకు ముందు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్, #RRR తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. #RRR తర్వాత గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రం తెలుగు తో పాటు హిందీ లో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఓటీటీ లో అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా సుమారుగా 9 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎంతలా ఇష్టపడ్డారు అనేది. ప్రస్తుతం ఆయన హ్రితిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చిత్రం చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టార్రర్ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉన్నది. ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ప్రతీరోజు సోషల్ మీడియా లో ఎన్టీఆర్ గురించి ఎదో ఒక ఆసక్తికరమైన వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈరోజు కూడా అదే జరిగింది. గతం లో ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే గేమ్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే, జెమినీ టీవీ లో ప్రసారమైన ఈ గేమ్ షో పెద్ద హిట్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ పలు ప్రశ్నలు సినిమా టాపిక్ గురించి కూడా అడుగుతుంటాడు. అలా ‘తొలిప్రేమ’ సినిమాకి సంబందించిన టాపిక్ వచ్చినప్పుడు, నాకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారిలో చిత్రాలలో ఒకటి ‘తొలిప్రేమ’. అనేకసార్లు ఈ సినిమాని నేను చూసాను. అందులోని పాటలు కూడా నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడట. అంతే కాదు ఆయన థియేటర్ లో చూసిన ఏకైక పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇదేనట.
ఈ చిత్రం విడుదలైన మూడేళ్లకు ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసాడు. కెరీర్ ప్రారంభంలోనే ఆయనకు ఎలాంటి మాస్ హీరో ఇమేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూతి మీద మీసాలు కూడా మొలవని వయస్సులోనే ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు పోటీగా మాస్ హీరో గా ఎదగడం అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత ఎన్టీఆర్ సినీ జీవిత ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయానికి వస్తే ‘వార్ 2 ‘ మూవీ పూర్తి షూటింగ్ ఈ నెలలోనే ముగిసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల నుండి ఆయన ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మామూలు రేంజ్ లో లేవు.