Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… కెరియర్ స్టార్టింగ్ లో స్టార్ హీరోలందరితో సినిమాలను చేశాడు. ఒక రకంగా స్టార్ హీరోలకు స్టార్ ఆ స్టార్ స్టేటస్ ని ఇచ్చింది కూడా తనే అని చెప్పాలి. ఇక అలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో వరుస ప్లాపులను అందుకుంటున్నాడు. కారణమేదైనా కూడా ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో ఆయన ఎక్కువగా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి. ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అతనితో సినిమా చేయాలి అంటేనే భయపడిపోతున్నారు… ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి సైతం ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ ను చూసి భయపడ్డాడు.
పూరి జగన్నాథ్ మూడు నెలల్లో సినిమాను చేసి ఇండస్ట్రీ హిట్ ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు గాడి తప్పినప్పటికి అతను చాలా తొందరగా సినిమాలను చేయగలడు అనే పేరు సంపాదించుకున్నాడు… ఇక సినిమాలను తొందరగా చేయడంలో పూరి జగన్నాథ్ ఎవరు బీట్ చేయలేరు.
రాజమౌళి సైతం అప్పటినుంచి ఇప్పటివరకు ఆ విషయంలో పూరి జగన్నాథ్ అని బీట్ చేయలేకపోయాడు అనేది వాస్తవం… నిజానికి పూరి జగన్నాథ్ కి చాలా గట్స్ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులనైన సరే తనకు అనుకూలంగా మార్చుకోగలిగే ధైర్యం ఉంటుంది.
అందువల్లే ఆయన ఇన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో తన మనుగడని కొనసాగించగలుగుతున్నాడు. ఒకానొక సమయంలో తన సొంత ఫ్రెండ్ తనని మోసం చేసినప్పుడు క్రుంగిపోకుండా తనను తాను పునర్ నిర్మించుకున్నాడు అంటే మామూలు విషయం కాదు…ఫ్లాప్ లను ఎలా డీల్ చేయాలి, సక్సెస్ లను ఎలా ఎంజాయ్ చేయాలి అనేది అతనికి తెలిసినంత గొప్పగా ఇంకేవరికి తెలియదనే చెప్పాలి…