https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: రైతుబిడ్డ పైకి దూసుకెళ్లిన అర్జున్, వాడి వేడి నామినేషన్స్ లో ఊహించని పరిణామాలు!

సండే ఎపిసోడ్ లో అమర్ తన పై పాట పాడిన విషయం పై నామినేట్ చేసింది అశ్విని. ' నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావా' అంటూ అమర్ ని నామినేట్ చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2023 / 04:37 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం మొదలైంది. కాగా గత వారం రాజమాతలుగా శోభా, ప్రియాంక చేసిన అన్యాయాన్ని తిప్పి కొట్టింది రతిక రోజ్. నిన్నటి నామినేషన్స్ లో శోభా శెట్టి, ప్రియాంక కి ఇచ్చి పడేసింది. ఇక అర్జున్ కూడా నామినేషన్స్ లో రెచ్చిపోయాడు. ఈ రోజు తాజా ప్రోమోలో అశ్విని అమర్ ని నామినేట్ చేసింది.ఆమె చెప్పిన రీజన్ తో అందరూ నవ్వుకున్నారు.

    సండే ఎపిసోడ్ లో అమర్ తన పై పాట పాడిన విషయం పై నామినేట్ చేసింది అశ్విని. ‘ నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావా’ అంటూ అమర్ ని నామినేట్ చేసింది. అది సరదాగా చేసింది .. ఇది చాలా సిల్లీ రీజన్ అని అమర్ సమాధానం చెప్పాడు. తర్వాత ప్రశాంత్, అర్జున్ ని నామినేట్ చేశాడు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ ని నామినేట్ చేశాడు అర్జున్. దీంతో రివేంజ్ నామినేషన్ వేశాడు పల్లవి ప్రశాంత్.

    ఇక ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘నన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అన్నావ్’ అని ప్రశాంత్ అన్నాడు. ‘నిన్ను ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని నేను అనలేదు’ అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు.’ తప్పు మాట్లాడుతున్నావ్ అన్నా’ అని ప్రశాంత్ అనడంతో… ‘నేను చెప్పేది తప్పని చెప్పడానికి నువ్వు ఎవడ్రా’ అంటూ అర్జున్ రెచ్చిపోయాడు.

    నేను ఎవరో గూగుల్ ని అడుగు అంటూ ప్రశాంత్ అనడంతో .. ‘ పల్లవి ప్రశాంత్ నన్ను నామినేట్ చేశాడు, నేను నిన్నే అడుగుతా .. వేరే వాళ్ళని ఎందుకు అడుగుతారా’ అంటూ అర్జున్ వాదించాడు. తర్వాత యావర్ అమర్ ని నామినేట్ చేశారు.’ రెండో వారం గురించి .. మూడో వారం గురించి తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తే తీసుకుంటావా అంటూ అమర్ అన్నాడు. ఇక చివర్లో అమర్ మర్చిపోయా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు 7 లేటెస్ట్ ప్రోమో ఆసక్తికర అంశాలతో సాగింది.