Mega Family: సంక్రాంతి ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న మెగా ఫ్యామిలీ…పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణం ఏంటంటే..?

మెగా ఫ్యామిలీ లో చాలామంది హీరోలు ఇండస్ట్రీకి తమదైన సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో వాళ్ళు అందరూ పర్సనల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా పండగ వచ్చిందంటే చాలు అందరూ ఒకచోట ఏకమైపోయి పండుగని చాలా సంతృప్తిగా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Written By: Gopi, Updated On : January 16, 2024 8:31 am

Mega Family

Follow us on

Mega Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి మెగా ఫ్యామిలీ లో చాలామంది హీరోలు ఇండస్ట్రీకి తమదైన సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో వాళ్ళు అందరూ పర్సనల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా పండగ వచ్చిందంటే చాలు అందరూ ఒకచోట ఏకమైపోయి పండుగని చాలా సంతృప్తిగా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలో ఈ సంక్రాంతిని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబందించిన పలు ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొన్ని విభేదాలు అయితే వస్తున్నాయంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక వీటన్నింటికీ చెక్ పెడుతూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు కూడా బెంగళూరులోని ఒక భారీ రిసార్ట్ లో సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మొత్తం విపరీతమైన వైరల్ అవుతున్నాయి. ఇక అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం ఈ సెలబ్రేషన్ లో పాల్గొని ఈ సంక్రాంతిని చాలా గ్రాండ్ గా జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని మినహాయిస్తే మెగా ఫ్యామిలీ లో ఉన్న అందరూ కలిసి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం… ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ కూడా రావాల్సింది కానీ తను ఎలక్షన్ క్యాంపైన్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు అంటూ పలు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.

ఇక ఆయన్ని మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా కలిసి చాలా గ్రాండ్ గా ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వాళ్లంతా చాలా సేపు మాట్లాడుకుంటూ ఎవరెవరు ఏ సినిమాలు చేస్తున్నారో కూడా చాలా డిస్కషన్లు జరిపినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కొంతవరకు నిరాశను చెందినట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఉంటే మెగా ఫ్యామిలీ పరిపూర్ణమయ్యేది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…