Guntur Kaaram Collections: కలెక్షన్ల సునామీ ని సృష్టిస్తున్న గుంటూరు కారం…మూడు రోజుల్లో అన్ని వందల కోట్లా..?

హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి భారీ కలక్షన్లను సంపాదించుకుంటుంది అంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా గుంటూరు కారం సినిమా కూడా భారీ వసుళ్లను సాధిస్తుందంటూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.

Written By: Gopi, Updated On : January 16, 2024 8:36 am

Sankranti 2024 Movies

Follow us on

Guntur Kaaram Collections: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి మొదటి షో తోనే డివైడ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు కానీ ప్రస్తుతం అందరికీ షాక్ ఇస్తు ఈ సినిమా భారీ రేంజ్ లో కలక్షన్స్ ని వసూలు చేస్తుందనే చెప్పాలి. ఇక ఈ సినిమాని చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఆసక్తిని చూపిస్తున్నారు అంటూ చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి భారీ కలక్షన్లను సంపాదించుకుంటుంది అంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా గుంటూరు కారం సినిమా కూడా భారీ వసుళ్లను సాధిస్తుందంటూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా మూడు రోజులకు 164 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టిందని మహేష్ బాబు కెరియర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది అంటూ సినిమా యూనిట్ ముక్తకంఠంగా తెలియజేస్తుంది. ‘రమణ గాడి సూపర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్ స్టాపబుల్’ అంటూ ట్విట్టర్ (ఎక్స్) లో ఈ సినిమా యూనిట్ పోస్ట్ చేసింది.

అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఎన్ని కలక్షన్స్ ని ఎలా సాధిస్తుంది అంటూ కొంత మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం మహేష్ బాబుకి ఉన్న స్టామినా అలాంటిది సినిమా బాగున్నా, బాలేకపోయినా మహేష్ బాబుని చూసి థియేటర్ కి వచ్చే జనాలు పుష్కలమైన మంది ఉండడం వల్ల ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ తెలియజేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇంకో మూడు రోజుల వరకు సంక్రాంతి హాలీడేస్ ఉండటం వల్ల ఈ సినిమా కలెక్షన్స్ భారీ రేంజ్ లో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా కథ, కథనం, డైరెక్షన్ పరంగా ఎలా ఉన్నా కూడా కమర్షియల్ గా మాత్రం భారీ కలక్షన్స్ ని రాబట్టడం ఆ సినిమాకి ఒక రకంగా మంచి విషయం అనే చెప్పాలి…