https://oktelugu.com/

Hari Hara Veera Mallu: సోషల్ మీడియాని ఊపేస్తున్న ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో..పవన్ కళ్యాణ్ లుక్స్,ఎనర్జీ అదుర్స్!

రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన 'మాట వినాలి' సాంగ్ ని విడుదల చేయగా దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 28 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసారు.

Written By: , Updated On : January 29, 2025 / 03:54 PM IST
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

Follow us on

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. దాదాపుగా 90 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే బోలెడంత ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియా లో విడుదలైంది. ముందుగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి, గ్లిమ్స్ వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్నికల సమయంలో విడుదల చేసిన టీజర్ కూడా అదిరిపోయింది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ‘మాట వినాలి’ సాంగ్ ని విడుదల చేయగా దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 28 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసారు.

ఇదంతా పక్కన పెడితే నేడు మాట వినాలి పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో ని మూవీ టీం విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు, ఇలాంటి సమయంలో ఆయన లుక్స్ సినిమాలో ఎలా ఉంటుందో అని అభిమానుల్లో కాస్త భయం ఉండేది. ఈ మేకింగ్ వీడియో లో ఆయన లుక్స్ చూసిన తర్వాత ఆ భయం మొత్తం పోయింది. ముఖ్యంగా ఆయన నవ్వు, అదే విధంగా మూడు బాణాలను సంధిస్తున్న షాట్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ షాట్ కనిపిస్తుంది. వీరమల్లు మూవీ నుండి వస్తున్న ప్రతీ కంటెంట్ చాలా బాగుందని, అభిమానులకు ఈ చిత్రం కచ్చితంగా ఒక తీపి జ్ఞాపకం లాగ మిగిలిపోతుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట చాలా గ్రాండ్ గా ఉంటుందట. యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడతో పాటు, యాంకర్ అనసూయ కూడా ఈ పాటలో పవన్ కళ్యాణ్ కలిసి డ్యాన్స్ చేస్తారని తెలుస్తుంది. సుమారుగా 500 మంది డ్యాన్సర్స్ తో, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఈ పాట ని చిత్రీకరించారట. ఈ పాటని చూసిన తర్వాత అభిమానులకు మూవీ ని ఎంత గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించారో అర్థం అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే అన్నపూర్ణ స్టూడియోస్ లో వారం రోజుల పాటు బాబీ డియోల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 5 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది.