Nani-Sujeeth movie updates: న్యాచురల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో నాని…ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన ఆయన ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాతో మరోసారి మాస్ అవతారం ఎత్తుతున్నాడు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను మాస్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన దసర సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిందో మనందరికి తెలిసిందే…కాబట్టి మరోసారి ఈ సినిమాతో కూడా మ్యాజిక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో భారీ విక్టరీని సాధించి ఎలాగైనా సరే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన పేరు మారు మ్రోగిపోయేలా చేసుకోవాలనే ప్రయత్నంలో నాని ఉన్నాడు. సుజీత్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక వెంటనే ఆయన టైం వేస్ట్ చేయకుండా నానితో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
సినిమా స్టార్ట్ చేయడానికి ముందే రిలీజ్ డేట్ ని తీసుకుంటే సినిమా షూటింగ్లో వేగం పెరుగుతోంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతాయనే ఉద్దేశ్యంతోనే వచ్చే సంవత్సరం క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని సినిమా మేకర్స్ భావిస్తున్నారు. ఎప్పుడూ ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తుండందనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
ఎందుకంటే ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నాని ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సన్నాహాలు చేస్తున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి… చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది… అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయగలుగుతారా? లేదా అనేది…