https://oktelugu.com/

ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయమే మెయిన్ హైలైట్

క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నంకు హీరోయిన్స్ ను బాగా చూపిస్తాడు అనే నేమ్ ఉంది. మణిరత్నం సినిమాల్లో నటించిన హీరోయిన్స్ అందరూ తమ కెరీర్ ల్లో ఉత్తమ నటి అనిపించుకున్నవారే. అంతగా మణిరత్నం వారి నుండి నటనను రాబట్టుకుంటాడు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సినీ కెరీర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే.. దానికి మణిరత్నం తీసిన ఇద్దరు సినిమానే. ఆ సినిమాతోనే ఐశ్వర్య రాయ్ పాపులారిటీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. బాలీవుడ్ సినిమాలు వెతుక్కుంటూ […]

Written By:
  • admin
  • , Updated On : August 28, 2020 / 03:17 PM IST
    Follow us on


    క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నంకు హీరోయిన్స్ ను బాగా చూపిస్తాడు అనే నేమ్ ఉంది. మణిరత్నం సినిమాల్లో నటించిన హీరోయిన్స్ అందరూ తమ కెరీర్ ల్లో ఉత్తమ నటి అనిపించుకున్నవారే. అంతగా మణిరత్నం వారి నుండి నటనను రాబట్టుకుంటాడు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సినీ కెరీర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే.. దానికి మణిరత్నం తీసిన ఇద్దరు సినిమానే. ఆ సినిమాతోనే ఐశ్వర్య రాయ్ పాపులారిటీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. బాలీవుడ్ సినిమాలు వెతుక్కుంటూ వచ్చేలా ఐశ్వర్య రాయ్ ను మణిరత్నం చాలా బాగా ప్రెజెంట్ చేసాడు ఆ సినిమాలో. మళ్లీ ఆ రేంజ్ లో ఐశ్వర్యరాయ్ ని చూపించబోతున్నాడు ఈ క్లాసిక్ డైరెక్టర్.

    Also Read: 2 లక్షలు కూడా ఎక్కువేనట.. పాపం పవన్‌ హీరోయిన్‌

    కాగా మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండేది. ఇక ఈ సినిమాలోనే ఐశ్వర్యరాయ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. డిసెంబర్ లో జరగబోయే షూట్ లో ఐశ్వర్యరాయ్ కూడా పాల్గొనబోతుందట. ఇంతకీ ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించట్లేదు. ఆమె ద్విపాత్రాభినయం చేయనుంది. ఆ రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాగా మరో పాత్ర ఆమె తల్లి పాత్ర మందాకినీ దేవి పాత్ర అట. ఈ పాత్రలు రెండు సినిమాలో మెయిన్ హైలైట్ అట.

    ఈ సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్రలుగా ఉండే ఈ పాత్రల కోసం ఐశ్వర్యరాయ్ బరువు కూడా పెరగనుంది. అయితే ఐశ్వర్యరాయ్ తల్లి పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవట. అలాగే నందిని పాత్ర ఎంతో ఆవేశపూరితంగా ఉంటుందని, అలాగే కథకు అనుగుణంగా ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని.. ఈ సాంగ్ లో కాస్త బోల్డ్ గా కనిపించడానికి ఐశ్వర్యారాయ్ కూడా అంగీకారాన్ని తెలిపిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెహమాన్ సాంగ్స్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

    Also Read: మాకు కరోనా రాలేదు.. దయచేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు !

    అలాగే ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి ఈ సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో జయం రవి, విక్రమ్, కార్తి, మరియు విజయ్ సేతుపతి, అలాగే ప్రత్యేక పాత్రలో డాక్టర్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ హీరోలతో పాటు.. త్రిష, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణంతో మణిరత్నం మరో భారీ సినిమాని చేస్తున్నాడు.