Allu Arjun Arrested: నేడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీడియా మొత్తం దీని గురించే చర్చించుకున్నారు. అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు పడిందని, ఆయన పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తాడని, ఇలా సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు అభిమానులను భయబ్రాంతులకు గురి చేసింది. అల్లు అర్జున్ మీద పడిన కేసులు సామాన్యులపై పడుంటే కచ్చితంగా పదేళ్లు జైలులో ఉండేవాళ్ళు. కానీ ఆయన తరుపున వాదించిన లాయర్ మామూలోడు కాదు. అతని వాదనకు ఎవరైనా తల ఒగ్గాల్సిందే. కేసు టేకప్ చేసాడంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అతను ఒక గంట పాటు కోర్టు కూర్చొని వాదిస్తే, నాలుగు లక్షల రూపాయిలు ఇస్తారు. రోజంతా కోర్టులోనే కూర్చుంటే 96 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఆయనకి వస్తుంది. ఈ స్థాయి ప్రొఫైల్ ఉన్న లాయర్ ని దింపారు.
ఈ నిరంజన్ రెడ్డి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రానికి నిర్మాత. మెగా ఫ్యామిలీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దశాబ్దాలుగా ఆ కుటుంబంతో సాన్నిహిత్యంతో కొనసాగుతూ, ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పెట్టుబడులు పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నేడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే ఆయన ఇంటికి చేరుకొని, నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి బెయిల్ ని మంజూరు అయ్యే మార్గాలను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆయన రిక్వెస్ట్ మేరకు వేరే చోట ఉన్న నిరంజన్ రెడ్డి, వెంటనే హైదరాబాద్ కి చేరుకొని అల్లు అర్జున్ కేసు ని టేకప్ చేసాడు. ఆయన వాదించిన వాదన మొత్తం లైవ్ లో రికార్డు అయ్యింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూసిన ప్రతీ ఒక్కరు, నిరంజన్ రెడ్డి వాదనని చూసి ఆశ్చర్యపోయారు.
ఇతని గురించి పలువురు చాలా గొప్పలు చెప్పారు, కానీ లైవ్ చూసిన తర్వాత అతను ఎంత సమర్థుడో అర్థమైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. క్వాష్ పిటీషన్ ని విచారించి, అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించిన తర్వాత, అతన్ని మరికాసేపట్లో జైలుకు తరలించబోతున్నారు అనే పరిస్థితి ఉన్నప్పుడు, బెయిల్ మంజూరు చెయ్యించాడంటే, ఇతని ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అతను వాదిస్తున్నంతసేపు అవతల వైపున్న లాయర్ కౌంటర్లు వేయలేకపోయారు. జడ్జి కూడా పలు సందర్భాల్లో తడబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రేంజ్ లో వణుకు పుట్టించాడు నిరంజన్ రెడ్డి. అసలు ఆయన లేవదీసిన పాయింట్స్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ప్రతీ పాయింట్ లోనూ ప్రభుత్వం వైపు ఉన్నటువంటి లూప్ హోల్స్ ని బయటకి తీసి, వాళ్ళను డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయేలా చేసాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్ కి వ్యక్తిగత లాయర్ గా కూడా వ్యవహరించాడు, జగన్ మీద ఎలాంటి కేసులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అతను ఇన్ని రోజులు బెయిల్ మీద బయట ఉండడానికి కారణమే ఈ నిరంజన్ రెడ్డి. ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన రేంజ్ ఏంటో. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ వీడియో ని చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
#WeStandWithAlluArjun
High Court Full Video…#AlluArjunArrest #AlluArjun #AlluArjunArrested pic.twitter.com/mJd4vQ3zEm— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) December 13, 2024