Thangalaan OTT: ‘తంగలాన్’ ఓటీటీ విడుదలపై సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..అసలు ఏమి జరిగిందంటే!

తమిళ భాషలకు కలిపి 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కనీసం 180 కోట్ల రూపాయిలు రాబట్టాలి. దీంతో కమర్షియల్ గా డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. తెలుగు వెర్షన్ కి కూడా మిశ్రమ స్పందన లభించింది.

Written By: Vicky, Updated On : October 22, 2024 9:15 am

Thangalaan(1)

Follow us on

Thangalaan OTT: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకున్న చిత్రాలలో ఒకటి, చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’. ఈ సినిమా కి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, కేవలం ఒక వర్గం ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీయడం వల్ల అనుకున్న రేంజ్ సక్సెస్ అవ్వలేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగ్తా ఈ చిత్రానికి ఫుల్ రన్ లో తెలుగు , తమిళ భాషలకు కలిపి 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కనీసం 180 కోట్ల రూపాయిలు రాబట్టాలి. దీంతో కమర్షియల్ గా డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. తెలుగు వెర్షన్ కి కూడా మిశ్రమ స్పందన లభించింది.

ఇదంతా పక్కన ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ నిర్మాతలకు, నెట్ ఫ్లిక్స్ సంస్థకి మధ్య జరగాల్సిన కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కారణంగా ఈ సినిమా ఇన్ని రోజులు ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులో రాలేదు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని, నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ సినిమా పావు హై కోర్టులో కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాలో వైష్ణవులను, వైష్ణవ మతాన్ని కించపరుస్తూ చాలా సన్నివేశాలు ఉన్నాయని,ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేస్తే మతాల మధ్య విద్వేషాలు చెలరేగి పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వరాదని ప్రజా ప్రయోజన సంఘం వారు పోరుకోడి మద్రాసు హై కోర్టులో పిటీషన్ దాఖాలు చేసారు. దీనిని విచారించిన హై కోర్టు ‘నిబంధనలకు తగ్గట్టుగానే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చింది. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు. తంగలాన్ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసుకోవచ్చు’ అని పిటీషన్ ని కొట్టిపారేసింది.

దీంతో ఈ చిత్రం ఓటీటీ లో విడుదల అవ్వడానికి ఉన్న అడ్డంకులు మొత్తం తొలగిపోయినట్టే అని చెప్పొచ్చు. ఈ దీపావళికి సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. థియేటర్స్ లో ఈ సినిమాని చూసేందుకు చాలా ఓపిక కావాలి, కానీ ఓటీటీ లో ఆడియన్స్ ఇలాంటి చిత్రాలకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కథలో దమ్ము ఉంది, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది, ఒక సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా ఈ సినిమా ఉంటుంది. విక్రమ్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా తన అద్భుతమైన నటనతో అదరగొట్టేసింది, కచ్చితంగా చూడాల్సిన సినిమా, ఎవ్వరూ మిస్ అవ్వకండి.