Homeఎంటర్టైన్మెంట్Rajasekhar : పెళ్లి కాకుండా హీరో రాజశేఖర్ తో ఒకే గదిలో ఉన్న హీరోయిన్, కట్...

Rajasekhar : పెళ్లి కాకుండా హీరో రాజశేఖర్ తో ఒకే గదిలో ఉన్న హీరోయిన్, కట్ చేస్తే.. మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్!

Rajasekhar : చెన్నైలో పుట్టిన రాజశేఖర్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో రాజశేఖర్ ఖాతాలో అనేక బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. రాజశేఖర్ కెరీర్ ప్రస్తుతం నెమ్మదించింది. ఈ జనరేషన్ ఆయన సినిమాలు చూడటం లేదు. ఆ మధ్య నితిన్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ కూడా చేశాడు. దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో జైల్లో ఖైదీగా ఆయన కనిపించారు. కాగా రాజశేఖర్ వివాహం కాకముందు. ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట. ఆమెతో పాటు ఒకే గదిలో నివాసం ఉండేవాడట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు జీవిత. స్టార్ కపుల్ జీవిత-రాజశేఖర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహానికి ముందు చాలా డ్రామా నడిచిందట. రాజశేఖర్ కి జంటగా జీవిత పలు చిత్రాలు చేసింది. వీరి కాంబోలో వచ్చిన అంకుశం బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రొఫెషనల్ గా మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఒకరినొకరు ఇష్టపడ్డాక ఒకే గదిలో ఉండేవారట. అప్పట్లో ఇండస్ట్రీ లో ఇది హాట్ టాపిక్ అయ్యిందట.

కాగా రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఆయనకు మరో సంబంధం చూశారట. దాదాపు పెళ్లి ఫిక్స్ చేశారట. ఒకరోజు కారులో రాజశేఖర్, తనకు కాబోయే అమ్మాయి, జీవిత గుడికి వెళ్లారట. వారిద్దరూ ముందు సీట్లో కూర్చుంటే.. జీవిత వెనక సీట్లో కూర్చుందట. అది ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించిందట. అనుకోకుండా ఆ అమ్మాయితో పెళ్లి రద్దు అయ్యిందట. అనంతరం జీవిత-రాజశేఖర్ జంటగా చేస్తున్న చిత్ర షూటింగ్ లో రాజశేఖర్ కి ప్రమాదం జరిగిందట.

నెల రోజులు రాజశేఖర్ బెడ్ కే పరిమితం అయ్యాడట. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి రాజశేఖర్-జీవిత వివాహం చేసుకున్నారట. జీవిత దంపతులు నిర్మాతలుగా కూడా చిత్రాలు చేశారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం. శివాత్మిక చిన్న అమ్మాయి కాగా, పెద్దమ్మాయి పేరు శివాని. దొరసాని, రంగమార్తాండ వంటి చిత్రాల్లో శివాత్మిక నటించింది. ఇక శివాని సైతం కొన్ని సినిమాలు చేసింది. ఈ స్టార్ కిడ్స్ ఇద్దరూ అటు తమిళ్ లో కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆఫర్స్ రావు. అందుకే ఇతర పరిశ్రమల మీద దృష్టి పెడుతున్నారు.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version