Rajinikanth midnight bike ride: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) చాలా సైలెంట్ గా తన పని తానూ చేసుకొని వెళ్లిపోయే మనిషి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన సెట్స్ లో ఉన్నంతసేపు తన తోటి నటీనటులతో చాలా సరదాగా ఉంటాడు, ఫన్నీ జోక్స్ కూడా వేస్తుంటాడు. ఆయనతో గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించిన హీరోయిన్స్ లో ఒకరు రాధికా. ఈమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రజినీకాంత్ తో తనకు ఉన్న అనుబంధం గురించి, వాళ్ళ మధ్య జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పుకొచ్చింది రాధికా. ఆమె మాట్లాడిన మాటలు వింటే రజినీకాంత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనిపించక తప్పదు. అది రజినీకాంత్ కి లతా తో పెళ్లి జరిగి కొన్ని రోజులే అయిన సందర్భం అట.
దీని గురించి రాధికా మాట్లాడుతూ ‘ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత నేను రజినీకాంత్ కలిసి బైక్ మీద చెన్నై లో రాత్రంతా షికార్లు కొట్టాము. ఆ సమయం లో రజినీకాంత్ తన సినీ కెరీర్ ఆరంభంలో ఎదురుకున్న కష్టాలను గుర్తు చేసుకొని బాగా ఎమోషనల్ అయిపోయాడు. బైక్ మీద వెళ్తున్న సమయం లో గతం లో ఆయన ఉన్న ప్రాంతాలను గుర్తు చేసుకుంటూ, ఇక్కడే నేను పడుకునేవాడిని , ఈ హోటల్ లోనే తినేవాడిని, ఆ రోజుల్లో ఇక్కడే నేను ఉండేవాడిని అని చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు. అలా మేము బైకు మీద వెళ్తుండగా ఒక్కసారిగా మమ్మల్ని ఓవర్ టేక్ చేస్తూ మా ముందుకు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు నుండి రజినీకాంత్ భార్య లతా సోదరుడు , రవి రాఘవేంద్ర(మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తండ్రి) దిగి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. నిజానికి నేను, రజిని కలిసి బైక్ మీద షికారు చేస్తున్న విషయం ఆయన భార్య లతా కి తెలుసు అనే విషయం రవి రాఘవేంద్ర కి తెలియదు. చివరికి ఈ సంఘటన ఫన్నీ గా మారిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది రాధికా.
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే, గత ఏడాది ఆయన నుండి విడుదలైన ‘కూలీ’ చిత్రం భారీ అంచనాల నడుమ వచ్చి, యావరేజ్ ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అనుకున్నారు. కానీ కేవలం 500 కోట్ల వద్దే ఆగిపోయింది ఈ చిత్రం. ప్రస్తుతం సూపర్ స్టార్ ‘జైలర్ 2 ‘ చేస్తున్నాడు. ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్లు కొడుతుందనే నమ్మకం కోలీవుడ్ లో ఉంది. ‘జైలర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘జైలర్ 2’ సరిగ్గా తీస్తే వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ ని కచ్చితంగా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.