Shekhar Kammula : శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాలకి మొదట అనుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

ఇక లీడర్ సినిమాని కూడా శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ తో చేయాలని స్క్రిప్ట్ రాసుకున్నాడట. కానీ కొన్ని అనువార్య కారణాలవల్ల అది కుదరలేదు. ఇక రానాతో ఆ సినిమాను చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అలాగే ఫిదా సినిమాను మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడట..

Written By: NARESH, Updated On : March 15, 2024 8:40 am
Follow us on

Shekhar Kammula : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టేస్ట్ ఉన్న దర్శకులు ఎవరైనా ఉన్నారు అంటే అది శేఖర్ కమ్ముల అనే చెప్పాలి. ఈయన తీసిన ప్రతి సినిమా యూత్ ను అట్రాక్ట్ చేయడమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పించే విధంగా ఉంటాయి. అందువల్లే ఈయన సినిమాలకి తెలుగులో మంచి క్రేజ్ అయితే ఉంటుంది.

ఇక దీనికి తగ్గట్టుగానే ఈయన సినిమాల్లో చేసే హీరోలకి కూడా చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది. దానివల్ల ఇండస్ట్రి లో శేఖర్ కమ్ముల తో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ఈయన రాసుకున్న ప్రతి సినిమా స్టోరీకి ముందు వేరే హీరోని అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వాటిలోకి మరొక హీరో వచ్చి చేయడం అనేది సాధారణంగా జరుగుతూనే వస్తుంది…

ఇక ముందుగా ఈయన రాసుకున్న ఆనంద్ సినిమా స్టోరీని ఉదయ్ కిరణ్ లాంటి స్టార్ హీరోతో చేయాలని అనుకున్నారట. కానీ అప్పుడు ఉదయ్ కిరణ్ కొన్ని సినిమాలతో బిజీగా ఉండడంవల్ల ఈ సినిమాని చేయలేకపోయాడు. దానివల్ల శేఖర్ కమ్ముల ఈ సినిమాని రాజా తో చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన గోదావరి సినిమాని అక్కినేని నాగార్జునతో చేయాలని అనుకున్నాడట. కానీ నాగార్జున ఇమేజ్ కు తగ్గ స్టోరీ అది కాకపోవడంతో నాగార్జున దానిని రిజెక్ట్ చేశాడు. దానివల్ల సుమంత్ తో ఈ సినిమా చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఇదిలా ఉంటే హ్యాపీ డేస్ సినిమాను యంగ్ కుర్రాళ్లతో చేయాలని కొత్త ఆర్టిస్టులతో చేసి సూపర్ సక్సెస్ సాధించాడు.

ఇక లీడర్ సినిమాని కూడా శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ తో చేయాలని స్క్రిప్ట్ రాసుకున్నాడట. కానీ కొన్ని అనువార్య కారణాలవల్ల అది కుదరలేదు. ఇక రానాతో ఆ సినిమాను చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అలాగే ఫిదా సినిమాను మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడట…కానీ మహేష్ బాబు మాత్రం ఆయన ఇమేజ్ కు తగ్గ కథ కాదనే ఉద్దేశ్యం తోనే దాన్ని రిజెక్ట్ చేశాడు. దాంతో మెగా ప్రిన్స్ గా గుర్తింపు పొందిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…