Nani The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న ‘ది పారడైజ్’ సినిమా మీద ప్రతి ఒక్కరికి విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే నాని ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా టైర్ వన్ హీరో గా మారే అవకాశాలైతే ఉన్నాయి… ఇక వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉన్నప్పటికి అటు నాని, ఇటు శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కూడా చాలా వరకు క్రియేట్ డిఫరెన్సెస్ తో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని విషయాల్లో శ్రీకాంత్ ఓదెల చెప్పేది నాని కి నచ్చడం లేదట… నాని చెప్పే సజెషన్స్ శ్రీకాంత్ కి ఎక్కడం లేదట…
ఇలా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయంలో క్లారిటి అయితే లేదు. ఇక రీసెంట్ గా నాని సినిమా యూనిట్ మొత్తం మీద కోపానికి వచ్చి సెట్ నుంచి బయటకు వచ్చేసినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ కలిసి సినిమాను చేసి ఒక బెస్ట్ ప్రొడక్ట్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తే బాగుంటుందని అటు నాని అభిమానులు, ఇటు శ్రీకాంత్ ఓదెల ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. కాబట్టి దానిని వాడుకొని సూపర్ సక్సెస్ ని సాధిస్తే వీళ్లిద్దరికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక వాటి మీద దృష్టి పెట్టాలి కానీ ఎవరి పంతాలకు వాళ్లు వెళ్లి సినిమాను చెడగొడితే అది ఇద్దరికి బ్యాడ్ నేమ్ అవుతుంది.
ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేసుకుంటే బాగుంటుందంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందనే నమ్మకంలో అభిమానులైతే ఉన్నారు. మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలని కోరుకుందాం…