
ఎంతో మంది హీరోలున్నారు. కానీ దానగుణంలో ఎంత మంది ఉన్నారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఆ ప్రజలకు , పేదలు, పేద కళాకారులను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రారు. చిరంజీవి లాంటి కొందరు హీరోలు మాత్రమే నిస్వార్థంగా సేవలు చేస్తున్నారు.
ఇక టాలీవుడ్ లో గొప్ప నటుడిగా కీర్తినందుకున్న రియల్ హీరో శ్రీహరి ఔదార్యం గురించి తాజాగా నటుడు ఫృథ్వీరాజ్ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫృథ్వీరాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా తన ఇంటి ముందుకు వస్తే శ్రీహరి బాల్కనీలో నిల్చొని డబ్బుకు రాయి కట్టి దానిని గుడ్డలో చుట్టి రోడ్డుపైకి విసిరేసేవాడని.. బాధితులు కళ్లకు అద్దుకొని పోయేవారని ఫృథ్వీరాజ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటులున్న అంత దానం చేసిన హీరో మరొకరు లేరని నటుడు ఫృథ్వీరాజ్ అన్నారు.
ఇక ఉదయ్ కిరణ్ కూడా అనవసరంగా చనిపోయాడని.. లవర్ బాయ్గా మంచి ఇమేజ్ సంపాదించిన తర్వాత సినిమా అవకాశాలు లేక చనిపోవడం దారుణమని మరో నటుడు బెనర్జీ అన్నారు. తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో తెలియదన్నారు. పెళ్లైంది.. భార్య ఉంది.. సినిమాలు చేస్తున్నావ్.. జీవితాన్ని ఎంజాయ్ చేయ్ అని నేను చెప్పేవాడిని అని అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయిందని అన్నారు.