
ఇతర వ్యాధులతో పోలిస్తే కరోనా మహమ్మారి సాధారణ ప్రజలను తెగ టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన వాళ్లను వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. బ్రిటన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో రోగనిరోధక స్పందన దారి తప్పి సొంత కణజాలం, అవయవాలను లక్ష్యంగా చేసుకుంటోందని తేలడం గమనార్హం.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో అనేక సమస్యలకు ఇదే కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తుండటం గమనార్హం. ఈ అధ్యయనం కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా సోకిన వాళ్లలో కొన్ని అనూహ్య లక్షణాలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 84 మంది కరోనా బాధితులపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
కరోనా వైరస్ ఆటో ఇమ్యూన్ ప్రక్రియను ప్రేరేపించడం వల్ల కూడా ఈ విధంగా జరుగుతూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆటో ఇమ్యూన్ ప్రక్రియ వల్ల రోగనిరోధక వ్యవస్థ దారి తప్పి సొంత శరీరంపైనే దాడి చేయడం జరుగుతుంది. కరోనా బాధితుల్లో ఇతరులతో పోలిస్తే ఆటో యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తీవ్రస్థాయి కరోనా లక్షణాలు ఉన్నవాళ్లలో ఇవి కనిపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో ఆటో ఇమ్యూన్ రుగ్మతలు తలెత్తుతున్నాయి. వైరస్ నుంచి కోలుకున్న తరువాత ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్య చికిత్స చేయించుకుంటే మంచిది.