https://oktelugu.com/

Roja: రోజాకు అన్నగా భర్తగా నటించిన ఆ హీరో ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ కి బడిపంతులు సినిమాలో మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాల్లో ఆయనకు జంటగా నటించి హిట్ పెయిర్ లిస్ట్ లో చేరింది. తెలుగు చిత్రాలలో ఇలాంటివి చాలా మంది హీరోహీరోయిన్ లకు ఎదురయ్యాయి.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 03:29 PM IST

    Roja

    Follow us on

    Roja: కొన్ని సార్లు హీరోహీరోయిన్ ల వరుసలు చేంజ్ అవుతుంటాయి. అర్థం కాలేదు కదా. ఒక సినిమాలో అక్కగా మరో సినిమాలో భార్యగా నటించడం కామన్ గా జరుగుతుంటుంది. ఇలా నటిస్తున్నప్పుడు వారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వచ్చిన పాత్రకు న్యాయం చేయాలి అని మాత్రమే ఆలోచిస్తారు. ఇక కొన్ని సీన్లలో రొమాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి పాత్రను ఇప్పుడు చూద్దాం.

    ఎన్టీఆర్ కి బడిపంతులు సినిమాలో మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాల్లో ఆయనకు జంటగా నటించి హిట్ పెయిర్ లిస్ట్ లో చేరింది. తెలుగు చిత్రాలలో ఇలాంటివి చాలా మంది హీరోహీరోయిన్ లకు ఎదురయ్యాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా తనకు అన్నయ్యగా నటించిన హీరోకి ఆ తర్వాత కాలంలో జంటగా నటించాల్సి వచ్చింది. ఈమె 90 దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది.

    ఇక టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది రోజా. 2000 సంవత్సరం వరకు హీరోయిన్ గా రాణించింది. ఆ తర్వాత సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన మూడవ సినిమా సీతారత్నం గారి అబ్బాయి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1992లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో వినోద్ కుమార్ నటించగా ఆయనకు జంటగా రోజా నటించారు.

    రోజా అన్నయ్య పాత్రలో శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో నటించారు. అప్పటికీ శ్రీకాంత్ హీరోగా నటించలేదు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి జంటగా నటించారు. 2000లో వీరిద్దరు కలిసి క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో జోడీగా నటిస్తే.. అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో శ్రీకాంత్ కి భార్యగా నటించింది రోజా. అదే సంవత్సరం తిరుమల తిరుపతి సినిమాలో కూడా జోడీగా నటించారు. అయితే రోజా తనను అన్న అన్న అని పిలిచేదని.. అలా పిలుస్తూ.. సినిమాల్లో నటిస్తుంటే కపుల్ ఫీల్ రాదని అలా పిలవద్దని కోపగించుకున్నారట శ్రీకాంత్.