Tollywood: ప్రస్తుతం ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువై పోయింది. ఇక ఇప్పుడు మూడోవ తరం హీరోలను సైతం రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి మూడు తరాల హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నాలుగో తరం హీరోగా హరికృష్ణ మనవడు జానకిరామ్ కొడుకు అయిన యంగ్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు. వైవిస్ చౌదరి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు… ఇక మెగా ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
తొందర్లోనే ఆయన సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ సైతం తొందర్లోనే హీరోగా తన మొదటి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మొదటి తరం హీరోగా విక్టరీ వెంకటేష్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక రెండో తరం హీరోగా రానా దగ్గుపాటి, అభిరామ్ లాంటి నటులు వచ్చారు.
రానా ఇప్పటికే పలు సినిమాలు చేస్తున్నప్పటికి హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కొన్ని పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతున్నాడు… ఇక వెంకటేష్ కొడుకు సైతం ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వెంకటేష్ కొడుకు అర్జున్ ఫారన్ లో యాక్టింగ్ కి సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నాడు.
తొందర్లోనే ఆయన కూడా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే తరాల్లో కూడా వాళ్ళ వారసులు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి తమ సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ వారసులందరిలో ఎవరు టాప్ హీరోగా మారతారు. ఎవరు ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…