
AP Movie Ticket rates: ఏపీలో టిక్కెట్ రేట్లపై చర్చించి సినిమా ఇండస్ట్రీ ప్రధాన సమస్యను పరిష్కరించాలని నిన్న నాగార్జున జగన్ ను కలసి కోరాడు. జగన్ కి నాగార్జునకు మంచి పరిచయం ఉంది. కానీ నాగ్ అడిగితే చేసేందుకు జగన్ రెడీగా ఉన్నాడా ? సినీ పెద్దలకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా జగన్ ఆలోచిస్తున్నాడు. అలాంటిది వాళ్ళ కోరికల చిట్టాను ఎందుకు పట్టించుకుంటాడు ? కాబట్టి నాగ్ కి కూడా మరోసారి నిరాశే ఎదురయిందనే అనుకోవాలి. పెద్ద సినిమాలు విడుదల చేసుకోవాలి అంటే.. భారీగా టిక్కెట్లను అమ్ముకోవాలి.
అప్పుడే కలెక్షన్స్ వందల కోట్ల మార్క్ ను చేరుకుంటుంది. వాళ్ళు వందల కోట్లు సంపాదించుకోవడానికి ప్రజల పై అదనపు భారం వేయడం ఏమిటి ? ఇది జగన్ కి నచ్చలేదు. జగన్ కి ఏమిటి ? ప్రజల ఎవరికీ నచ్చలేదు. సినిమా ఇండస్ట్రీలో శ్రీకాకుళం లో థియేటర్లు బాగుండవు అని పేరు ఉంది. అందుకు తగ్గట్టుగానే శ్రీకాకుళం లో థియేటర్లు అలాగే ఉంటాయి. కానీ ఆ డబ్బా థియేటర్ లో కూడా టికెట్ కాస్ట్ 250 రూపాయిలు… అంటే ఎం మాట్లాడాలి.. దీన్ని దోపిడీ అనకుండా ఎలా ఉండగలం ?


అలాంటి థియేటర్స్ లో మినుముమ్ ఏసీ కూడా సరిగ్గా వెయ్యరు. ఇక బాత్రూమ్స్ అయితే అద్వాన్నంగా ఉంటాయి. ఇప్పుడు జగన్ కారణంగా అదే థియేటర్ లో టికెట్ 100 రూపాయిలు. ఇంతకుమునుపు కూడా నార్మల్ డేస్ లో ఆ టికెట్ కాస్ట్ 112 రూపాయిలు. పెద్ద సినిమాల ఓపెనింగ్ రోజు మాత్రం 500 కూడా పలుకుతుంది.
అసలు వాళ్ళిచ్చే ఫెసిలిటీస్ కి 100 కూడా ఎక్కువే. ఇంకా చెప్పాలంటే… 70 కూడా ఎక్కువే.
అలాగే ఎక్స్ట్రా షోస్ పేరుతో మరో దోపిడీ ఉంటుంది. ఇప్పుడు కరోనా కాబట్టి.. ఉన్న షోస్ కే దిక్కు లేదు. లేకపోతే ఈ ఎక్స్ట్రా షోస్ తో ప్రజల జేబులు చిల్లు పడేవి. అందుకే ఈ సినిమా వాళ్ళ కష్టాలన్నీ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన పని లేదు.
Also Read: నాగార్జున కోసం జగన్ అంత పని చేశాడా?