https://oktelugu.com/

Director B Gopal : నాగార్జున సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే అవకాశాన్ని వదులుకున్న స్టార్ డైరెక్టర్..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది దర్శకులు తమకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటున్నారు...ఇంతకు ముందు తరం లో ఉన్న డైరెక్టర్స్ కూడా వండర్స్ ను క్రియేట్ చేసినవారే కావడం విశేషం...

Written By:
  • Neelambaram
  • , Updated On : September 9, 2024 / 07:50 PM IST

    Director B Gopal

    Follow us on

    Director B Gopal : సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నాగచైతన్య వరకు ప్రతి ఒక్కరు తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున మాత్రం సెలెక్టెడ్ గా క్యారెక్టర్లు ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. అందుకోసమే విభిన్న పాత్రలను పోషిస్తూ భారీ రేంజ్ లో సినిమాలను ఎలివేట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఒకప్పుడు నాగార్జున నాగేశ్వరరావు లెగసీని ఇండస్ట్రీలో కంటిన్యూ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలైతే చేశాడు. మొదట్లో ఆయనకు యాక్టింగ్ రావడం లేదంటూ చాలా విమర్శలను ఎదుర్కొన్నప్పటికి శివ సినిమాతో ఒక్కసారిగా అందరి అంచనాలను తలకిందులు చేశాడు. మరి అలాంటి నాగార్జున అప్పటినుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

    ఇక ఇదిలా ఉంటే కమర్షియల్ డైరెక్టర్లలో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు బి గోపాల్.. ఇక వీళ్ల కాంబినేషన్ లో కలెక్టర్ గారి అబ్బాయి లాంటి సినిమా వచ్చినప్పటికీ ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ అనేది పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. ఇక దాంతో బి గోపాల్ వరుసగా రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇదే సమయంలో నాగార్జున తనతో ఒక సినిమాని రీమేక్ చేయమని బి.గోపాల్ ని అడిగారట.

    కానీ అప్పటికే తను కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉండడం వల్ల నాగార్జున తో సినిమా చేయలేకపోయాడు. ఇక తర్వాత ఆ సినిమాని ఇవివి సత్యనారాయణ కృష్ణ నాగార్జునలను పెట్టి ‘వారసుడు ‘ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా నాగార్జున ప్రేక్షకులందరిలో ఒక చెరగని ముద్ర ను వేసుకున్నాడు. ఇక ఆ సమయం లో నాగార్జున చేసిన ప్రతి సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంటూ వచ్చాయి. ఇక ఇలాంటి క్రమం లోనే బి.గోపాల్ ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్నాను అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…

    అప్పుడు కనక తను వారసుడు సినిమా చేసి ఉంటే నాగార్జున కి కూడా ఒక మంచి సక్సెస్ ని అందించిన వాడిని అయ్యేవాడిని స్టార్ హీరోలందరి సక్సెస్ అందించిన ఆయన నాగార్జునకు మాత్రం భారీ సక్సెస్ ని ఇవ్వలేకపోయాను అంటూ బాధపడ్డాడు. ఇక మొత్తానికైతే బి.గోపాల్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన సినిమాలేమీ చేయనప్పటికీ ఆయన సాధించిన విజయాల గురించి ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులు కూడా మాట్లాడుకోవడం విశేషం…