The Girlfriend Movie Collections: ఈ ఏడాది చిన్న సినిమాల సక్సెస్ రేట్ మామూలు రేంజ్ లో లేవు. పెద్ద సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి కానీ,చిన్న సినిమాలకు వచ్చినంత లాభాలు మాత్రం పెద్ద సినిమాలకు రావడం లేదు. కేవలం తెలుగు లోనే కాదు, తమిళ లోనూ ఇదే పరిస్థితి. అలా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ వైపుకు దూసుకుపోతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girl Friend Movie). రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో తెరెకక్కిన ఈ సినిమాకి ఓపెనింగ్ వసూళ్లు చాలా తక్కువగా వచ్చాయి. కానీ రెండవ రోజు, మూడవ రోజున మొదటి రోజు కంటే రెండింతలు ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకున్నాయి. ఒక సినిమాకు పబ్లిక్ లో పాజిటివ్ మౌత్ టాక్ ఉంటే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ చిత్ర మరో ఉదాహరణ.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే మూడవ రోజున ఈ చిత్రానికి కోటి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 5 కోట్ల 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఇక కేవలం కోటి 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం ఫుల్ రన్ లో రాబడితే చాలు. ఈరోజు, రేపటి లోపల ఆ వసూళ్లను కూడా రాబట్టి పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ సూపర్ హిట్ గా నిల్చిన 20వ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది అట. ఫుల్ రన్ లో ఇంకా ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.
ఇక నార్త్ అమెరికాల విషయానికి వస్తే ఇప్పటి వరకు అక్కడ ఈ చిత్రం 3 లక్షల డాలర్లను రాబట్టింది అట. మరో లక్ష డాలర్లు వస్తే ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నట్టే. రష్మిక కి తన కెరీర్ లో ఇదే మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం. సమంత, నయనతార, అనుష్క వంటి వారు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి రష్మిక కూడా చేరడం గమనార్హం. భవిష్యత్తులో కూడా రష్మిక ఇలాంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తుందట. అందులో భాగంగానే అల్లు అర్జున్, అట్లీ మూవీ లో విలన్ క్యారక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కెరీర్ లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి క్యారక్టర్ చేయడానికి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి.